కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. విభిన్నమైన కథాంశంతో, బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు వరకు పెద్దగా అంచనాలు లేవు. కాని సినిమా విడుదలయిన తర్వాత భారీ ఎత్తున చిత్రానికి రెస్పాన్స్ దక్కింది. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌ను ఇంకా కూడా నమోదు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రంను సూపర్ హిట్ అని తేల్చి చెబుతున్నారు. ఈ సూపర్ హిట్ మూవీని మొదట సుధీర్‌బాబు వద్దకు దర్శకుడు అజయ్ తీసుకు వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. అయితే అజయ్ చెప్పిన కథ సుధీర్‌బాబుకు నచ్చలేదని, క్లైమాక్స్‌లో హీరో చనిపోవడం అంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు అంటూ చెప్పి సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.
సుధీర్‌బాబు తర్వాత విజయ్ దేవరకొండను కూడా అజయ్ కలిసినట్లుగా తెలుస్తోంది. కాని చివరకు అజయ్ ఈ స్క్రిప్ట్‌ను కార్తికేయ వద్దకు తీసుకు వెళ్లడం, పాయల్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటించేందుకు ఓకే చెప్పడంతో ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ మద్య ఉన్న రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి. యూత్ ఆడియన్స్ ఈ చిత్రంను ముద్దు సీన్స్ కోసం ఎక్కువగా చూసేందుకు వెళ్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే సుధీర్‌బాబు ఈ చిత్రంను చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ దర్శకుడు అజయ్ ఈ చిత్రాన్ని సుధీర్‌బాబుతో చేసి ఉంటే ముద్దు సీన్స్ పెట్టి ఉండేవాడు కాదు. అలాగే హీరో పాత్రను సాఫ్ట్‌గా చూపించే వాడు. అలా చూపిస్తే రెగ్యులర్ సినిమాలా ఉండి ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయేది. ఈ చిత్రాన్ని సుధీర్‌బాబు చేయక పోవడమే ఆయనకు మరియు అజయ్ భూపతికి కూడా మంచిది అంటూ కొందరు అంటున్నారు.