Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎంత గొప్ప దేశాన్ని అయినా దెబ్బ తీయాలంటే ఏమి చేయాలో తెలుసా ? ఈ విషయంలో సౌత్ ఆఫ్రికా కి చెందిన ఓ ప్రొఫెసర్ తన విద్యార్థులని ఉద్దేశించి రాసిన లేఖ చూస్తే మీకే అర్ధం అవుతుంది. యూనివర్సిటీకి వచ్చే ప్రవేశద్వారం వద్ద ఆయన ఈ సందేశం ఉంచాడు.
” ఏ దేశాన్ని అయినా నాశనం చేయాలంటే అణు బాంబుల అవసరం లేదు. సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణుల అవసరం అంతకన్నా లేదు. ఆ దేశంలో అందించే విద్యా ప్రమాణాలు పడిపోయేలా చేస్తే చాలు. పరీక్షల్లో విద్యార్ధులకి మోసం చేసే అవకాశం కల్పిస్తే చాలు. అలాంటి విద్యార్థులు వివిధ వృత్తుల్లోకి వస్తారు. అలా వచ్చిన ఓ డాక్టర్ రోగుల ప్రాణాలు తీస్తాడు. అలా వచ్చిన ఓ ఇంజనీర్ భవనాలు పడగొడతాడు. అలా వచ్చిన అకౌంటెంట్ తప్పుడు లెక్కలతో డబ్బు పోగొడతాడు. ఇక ఆ చదువులతో మతవ్యాప్తికి పూనుకునే వాళ్ళు మానవత్వాన్ని చంపేస్తారు. ఆలా చదివి వచ్చిన న్యాయ మూర్తుల చేతిలో న్యాయం జరగదు. అంటే విద్య ని నాశనం చేస్తే దేశాన్ని నాశనం చేసినట్టే”.
ఆ ప్రొఫెసర్ దక్షిణాఫ్రికా కి చెందినప్పటికీ ఆయన ఇచ్చిన సందేశం మాత్రం ప్రపంచం అంతటికీ వర్తిస్తుంది.
మరిన్ని వార్తలు: