Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గోవా బ్యూటీ ఇలియానాకు అరుదైన గౌరవం దక్కింది. ఫిజి దేశానికి పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఇలియానా నియమితురాలయింది. ప్రస్తుతం ఇలియానా ఫిజిలో పర్యటిస్తోంది. అందాలదేశం ఫిజితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, వారి ఆతిథ్యం, ప్రేమతో సొంత ఇంటిలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారని సంతోషం వ్యక్తంచేసింది. ఫిజితో భారత్ కు చాలా సంబంధాలున్నాయి. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో 38 శాతం భారత సంతతికి చెందిన వారే. ఫిజిలో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కవే. మరింత ఎక్కువగా భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ఇలియానాను ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.
ఇలియానా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం వల్ల తమ దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నామని ఫిజి పర్యాటక శాఖ మంత్రి చెప్పారు. దక్షిణాదిన అగ్రహీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా… తర్వాత బాలీవుడ్ కు షిఫ్టయింది. హిందీలో ఆమె నటిస్తున్న సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఇటీవల అజయ్ దేవగణ్ తో కలిసి ఆమె నటించిన రెయిడ్ మంచి వసూళ్లు రాబడుతోంది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకోవడంతో ఫిజి దేశం ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. గతంలో ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్ గా పరిణీతిచోప్రా, న్యూజిలాండ్ బ్రాండ్ అంబాసిడర్ గా సిద్దార్ద్ మల్హోత్రా వ్యవహరించారు.