మరిదితో బంధం సాగిస్తూ…భర్తనే చంపేశారు…

Illegal relationship with Pinney .... Babai's murder

ఆంధ్రప్రదేశ్ లని కర్నూలు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఆత్మకూరులోని గరీబ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల నాగరాజు అనే యువ‌కుడు.. ఈశ్వరమ్మ అనే యువతిని గ‌త సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు. వృత్తి రీత్యా వెంట్రుకల సేకరణ, గ్రామాలు తిరుగుతూ బూందీ విక్ర‌యిస్తూ ఉంటాడు నాగ‌రాజు. హాయిగా సాగుతోన్న వీరి సంసారంలో నాగ‌రాజు త‌మ్ముడు మహేష్ చొరబడ్డాడు. మాయమాటలతో వదినను లొబ‌ర్చుకున్న మ‌హేష్.. అన్న ఇంట్లో లేని స‌మ‌యంలో.. వ‌దిన‌తో అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగించాడు. అలా ఇలా వీరి మధ్య సాగుతోన్న వ్య‌వ‌హారం మితిమీరిపోయింది. భర్తముందే ఇద్దరూ ఫోన్ లలో స‌ర‌ససల్లాపాలు కానిచ్చేంత వరకు వచ్చింది. దీంతో ఆగ్ర‌హించిన భ‌ర్త‌.. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు.  అయినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ విష‌యంలో దంపతుల మధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జరుగుతుండేవి.

అయితే ఇది ఇలా సాగుతున్న సమయంలోనే నాగ‌రాజు మాయమైపోయాడు. ఈ నెల 24వ తేదీ నుంచి తన కొడుకు కనిపించడం లేదంటూ నాగరాజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు స‌మోదు చేసి విచారించసాగారు. శనివారం తెల్లవారుజామున నాగరాజు ఇంటి సమీపంలోని పొద‌ల్లో.. ఓ మృతదేహాన్ని కుక్క‌లు బ‌య‌ట‌కు లాక్కొచ్చాయి. ఈ విష‌యం పీఎస్ వ‌ర‌కు వెళ్ల‌డంతో.. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించారు. చొక్కా, లుంగీ ఆధారంగా ఆ మృతదేహం నాగ‌రాజుదేన‌ని త‌ల్లి గుర్తించింది. ఇలా వ‌దినామరదల్ల అక్రమ బంధం బ‌య‌ట‌ప‌డ‌డంతో వారిద్దరూ కలిసి నాగ‌రాజును హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇప్పుడు వదిన మరదలు ప‌రారీలో ఉండగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.