ఇష్టపూర్వక శృంగారం నేరమేమీ కాదు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు…!

Illegal Affair Is Not A Crime Declared Supreme Court

వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరింది. ఎవరైనా ఇష్టపూర్వక శృంగారం చేస్తే దాన్ని నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఎవరితో శృంగారం చేయాలి ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని మరో వ్యక్తి నిర్ణయించకూడదని అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా అలా చేస్తే రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

illegal-arrair
భార్యకు భర్తే సర్వస్వం కారాదు ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నాకచ్చితంగా దాన్ని నేరంగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే పెళ్లైన పురుషుడు భార్యతో కాకుండా మరో స్త్రీతో లైంగికంగా కలవడం నేరం కాదని తీర్పు వెల్లడించింది. అయితే ఆ స్త్రీ ఇష్టపూర్వకంగా అందుకు అంగీకరించాలని తెలిపింది. ఇదే నియమం స్త్రీ విషయంలో కూడా వర్తిస్తుందన్న న్యాయ స్థానం ఇష్ట పూర్వకంగా సాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది.

supreme-court-arrest
అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని కానీ దానిని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది. వివాహేతర సంబంధం ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లయితే దాన్ని మాత్రం నేరంగా పరిగణించాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్‌ 497 పురాతన చట్టమని ఆ చట్టం పూర్తిగా ఏకపక్షంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్‌ 497 శిక్షా స్మృతి సమాన అవకాశాలను కాలరాస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సెక్షన్ తో సమానత్వ హక్కుకు తూట్లు పడుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్‌ 497 రాజ్యాంగ సమ్మతం కాదన్న సుప్రీంకోర్టు.. భార్యకు భర్త సర్వాధికారి కాదని స్పష్టం చేసింది.