Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పుడు తెలంగాణలోనే కాదు జాతీయస్థాయిలో ఎక్సైజ్ శాఖ పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా అకున్ సభర్వాల్ ను బాహుబలి రేంజ్ లో ఎత్తేస్తోంది మీడియా. ఆయన పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని బెదిరించినా.. ఎక్కడా తగ్గడం లేదని వార్తలు వండి వారుస్తోంది. కానీ నిజంగా డ్రగ్స్ కేసులో పెద్ద చేపలు లేవా అనే డౌట్లు అలాగే ఉన్నారు. సినీఫీల్డ్ లో పెద్ద ఫ్యామిలీకి నోటీసులు వస్తాయని మీడియా చెబుతుంది కానీ.. సిట్ మాత్రం లీక్ ఇవ్వలేదు.
అసలు మొత్తం కేసులో నలభై మంది సెలబ్రిటీలున్నారని వార్తలొస్తే.. చివరకు ఏరి కోరి పన్నెండు మందికే నోటీసులు వచ్చాయి. ఆ ఇచ్చినవాళ్లలో కూడా పూరీ మాత్రమే కాస్త సెలబ్రిటీ. ఇప్పుడు ఆయన ఫ్లాప్ టైమ్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద పట్టించుకోనక్కర్లేదు. ఇక మిగతా వాళ్లందా బీ గ్రేడ్ సరుకే. వీరే డ్రగ్స్ దందాను నడిపించి, మిగతావారికి అలవాటు చేస్తారా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
కానీ ఇండస్ట్రీ పెద్దల్ని కాపాడేందుకు వీరిని బలిపశువులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినీ పెద్దల్ని గతంలో ఎదిరించినవారిని కక్షకట్టి ఈ కేసులో ఇరికించారనేలా విచారణ సాగుతోందని విమర్శకులు చెబుతున్నారు. అసలు హైస్కూలు పిల్లలకు డ్రగ్స్ సరఫరా అవుతుంటే.. స్కూలు యాజమాన్యాల్ని వదిలేసి.. టాలీవుడ్ లింకుతో కథను రంజుగా రక్తి కట్టిస్తున్నారు కేసీఆర్.
మరిన్ని వార్తలు
విశాఖ స్కామ్ ఏ తీరానికి చేరునో..?
సునంద కేసులో కొత్త ట్విస్ట్
వైసీపీ ఇప్పటికి పొలిటికల్ పార్టీ అయింది