Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ తో గిల్లికజ్జాలు పెట్టుకోవడం పాకిస్థాన్ కు అలవాటు. కానీ ఇప్పుడు చైనా కూడా తన మిత్రదేశం బాటలోనే నడుస్తోంది. పక్కనే ఉన్న భారత్ ఎదగకూడదన్న లక్ష్యంతో డ్రాగన్ కుట్రలు చేస్తోంది. అన్నివైపులా ఇండియాను కమ్మేయాలని, అందుకోసం సామ, దాన, భేద, దండోపాయాల్ని ప్రయోగిస్తోంది. సిల్క్ రూట్, దక్షిణ చైనా సముద్రం ఇలా డ్రాగన్ ఏ వివాదం పెట్టుకున్నా… అదంతా ఇండియాపై పట్టు కోసమే అనేది విశ్లేషకుల మాట.
డోక్లాం వివాదంలో చైనాకు ఇండియా గట్టిగా ఉండటం అస్సలు నచ్చడం లేదు. పైగా ఇండియా నాటి భారత్ కాదన్న జైట్లీ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లాయి. దీంతో యుద్ధానికి సిద్ధమంటోంది డ్రాగన్. తామేం చేతులు ముడుచుక్కూర్చోలేదని భారత్ దీటుగా జవాబు చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలో అణ్వాయుధాలే కీలకం. ఎంత సైన్యం ఉన్నా లాభం లేదు. అందుకే అమెరికా సైతం కొరియా చేసే క్షిపణి పరీక్షలకే భయపడుతోంది.
అలాంటిది చైనా భారత్ పై దాడి చేస్తుందంటే నమ్మడానికి చైనీయులే సిద్ధంగా లేరు. యుద్ధం వస్తే అరగంటలో భారత్ ఉండదు. నిజమే. కానీ అదే సమయంలో చైనా కూడా ఉండదు. అది మాత్రం డ్రాగన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. పైగా చైనా వస్తువులపై సుంకాలు విధించడంపై మండిపడుతోంది. మీకే నష్టమని బెదిరిస్తోంది. భారత్ కే నష్టమైతే చైనా ఎందుకు ఉలికిపడుతోందని మన నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు: