76 ఏళ్ల ప్రస్థానంలో భారత్‌ సాధించిన విజయాలెన్నో..ఈ సండిపుల నుంచి మూడో ఆర్థిక శక్తిగా.

India's many achievements in its 76-year reign.
India's many achievements in its 76-year reign.

దేశంగా మనుగడ సాగించలేదని ఈసడింపులు.. ప్రజాస్వామిక దేశంగా ఉండలేదని సందేహాలు.. దేశానికి ఉండాల్సిన లక్షణాలే లేవన్న పాశ్చాత్యులు.. వాటన్నింటినీ తోసిరాజని అభివృద్ధి పథంలో.. మున్ముందుకు దూసుకుపోతున్న భారతదేశం.. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. ఒక దేశంగా ఆట్టే కాలం మనలేదు. ప్రజాస్వామిక దేశంగా అస్సలు బతికి బట్టకట్టలేదు.. అసలు ఒక దేశంగా ఉండే లక్షణాలేవీ భారతదేశానికి లేవు. ఒక భాష కాదు.. ఒక సంస్కృతి కాదు..మాట, భాష, కులాలు, మతాలు.కట్టుబాట్లు,. ఇలా ఎన్నో వైరుధ్యాలు, వైవిధ్యాలున్న దేశం ఎంతకాలం మనుగడ సాగిస్తుంది?’’ .

భిన్న సంస్కృతుల సమాహారం

ఉత్తరాది.. దక్షిణాది భేదాలు! హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, పార్శీ, సిక్కు మతాలు!! తమిళం,తెలుగు, మలయాళం,హిందీ,కన్నడం ఇలా లెక్కకు మిక్కిలిగా భాషలు! ఎవరి భాష వారిది! ఎవరి సంస్కృతి వారిది!! వేర్పాటువాదాలు.. రకరకాల భావజాలాలు.. సిద్ధాంత వైరుధ్యాలు.. ఇన్ని వైవిధ్యాలున్న దేశం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందా? ఇలాంటి దేశాన్ని నియంతృత్వంతో తప్ప ప్రజాస్వామ్యంతో నడపడం సాధ్యమా? అలాంటివారి సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిన దేశం.. మన భారతదేశం. వివిధ మతాలు, కులాలు ఎన్ని ఉన్నా కూడా.. నయానో, భయానో, బుజ్జగించో, సంప్రదింపులు జరిపో అందరినీ రాజ్యాంగం పరిధిలోని ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొచ్చి, పనిచేసేలా, చేయగలగడం మన ప్రజాస్వామ్యం సాధించిన ఘనవిజయం. ఎద్దుల బండ్లు నడుపుకొనేవారని ఎద్దేవా చేసిన పాశ్చాత్యుల దిమ్మ తిరిగేలా.. హాలీవుడ్‌ సినిమాల కంటే తక్కువ బడ్జెట్‌తో భారతీయుల కలలను మోసుకుంటూ వెళ్లే మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ను విజయవంతం చేసింది!

అన్నింటా ముందంజ

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ తదితర విదేశీ కంపెనీలకు సీఈవోలను అందించింది!! ఆహార సమృద్ధిని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ముందంజలో నిలిచింది. 1989 నుంచి 2014 దాకా 25 ఏళ్లపాటు మనదేశంలో కూటమి ప్రభుత్వాలు విజయవంతంగా నడవడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడున్నర దశాబ్దాల్లో భారతదేశం సాధించిన విజయాలు చిన్నవి మాత్రం కావు. ప్రపంచమంతా తరచి చూసేంత పెద్దవి. అవును.. ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటికీ భారత్‌తో భాగస్వామ్యం కావాలి.. 140 కోట్ల పై చిలుకు జనాభాతో ఉన్న భారత మార్కెట్‌ కావాలి.. మన సహకారం కావాలి.. అనే పరిస్థితి ఉంది.

కరోనా కనువిప్పు కలిగించింది

దేశంగా మనుగడ సాగించలేదని ఈసడింపులు.. ప్రజాస్వామిక దేశంగా ఉండలేదని సందేహాలు.. దేశానికి ఉండాల్సిన లక్షణాలే లేవన్న పాశ్చాత్యులు.. వాటన్నింటినీ తోసిరాజని అభివృద్ధి పథంలో.. మున్ముందుకు దూసుకుపోతున్న భారతదేశం.. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. ఒక దేశంగా ఆట్టే కాలం మనలేదు. ప్రజాస్వామిక దేశంగా అస్సలు బతికి బట్టకట్టలేదు.. అసలు ఒక దేశంగా ఉండే లక్షణాలేవీ భారతదేశానికి లేవు. ఒక భాష కాదు.. ఒక సంస్కృతి కాదు..మాట, భాష, కులాలు, మతాలు.కట్టుబాట్లు,. ఇలా ఎన్నో వైరుధ్యాలు, వైవిధ్యాలున్న దేశం ఎంతకాలం మనుగడ సాగిస్తుంది?’’ .ఇదే ఈ ఏడున్నర దశాబ్దాల్లో భారత్‌ సాధించిన విజయం. ఈసడించినవారికి చెప్పిన గుణపాఠం. అలాంటివారి భ్రమలన్నింటినీ.. కరోనా మహమ్మారి పటాపంచలు చేసింది. అతి తక్కువ సమయంలోనే 200 కోట్ల మందికి విజయవంతంగా టీకాలు వేయగలిగింది.

మధ్య తరగతి భారతం

ఈ ఏడున్నర దశాబ్దాల భారత ప్రస్థానంలో.. మనం సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించింది మధ్యతరగతే అనడం అతిశయోక్తి కాదు. అందుకే మనదేశ మధ్యతరగతి వర్గాన్ని.. ‘ద గ్రేట్‌ ఇండియన్‌ మిడిల్‌ క్లాస్‌’గా అభివర్ణిస్తారు. అలాగని మధ్యతరగతి వర్గంలో సమస్యలు లేవని కావు. కులం, మతం లాంటి భేదాలున్నా కూడా.. వాటన్నింటినీ తోసిరాజని మధ్యతరగతి తాను పురోగమిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తోంది. అంతేకాదు.. మనదేశంలో మధ్యతరగతివారి సంఖ్య 40 కోట్ల దాకా ఉంటుంది. ఇంత భారీస్థాయిలో.. అదీ వర్కింగ్‌ క్లాస్‌లో మధ్యతరగతివారు ఉండడం భారత్‌కు ఎంతో కలిసొచ్చిన అంశం. మేధో వలస ప్రారంభమై వివిధ దేశాలకు వెళ్లిన తొలితరం భారతీయుల్లో అత్యధికులు భారతీయులే. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో కొలువైన దిగ్గజ టెక్‌ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న మన భారతీయుల్లో అత్యధికులు మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చినవారే. ఇక.. దేశంలో కూడా ఉద్యోగ వర్గంలో మెజారిటీ మధ్యతరగతివారే. అదే భారత్‌ సాధిస్తున్న అనేక విజయాలకు ఒక ప్రధాన కారణం.

చైనాతో పోటీ పడాలి..

భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు రెండింటీకీ స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లవుతున్న సందర్భంగా.. పాకిస్థాన్‌ ఎప్పుడూ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా లేదు. సైనిక శక్తి పడగనీడలోనే ఉంది. మరోవైపున.. మావో నేతృత్వంలోని చైనా కూడా 1950ల్లో మనతోపాటే అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రారంభించి ఆర్థికంగా మనకన్నా చాలా ముందుకు వెళ్లిపోయింది. రాజకీయంగా చూస్తే చైనా కన్నా భారత్‌ చాలా మెరుగ్గానే ఉందిగానీ.. ఏకపార్టీ పాలన కారణంగా చైనా ఆర్థికంగా పెద్ద పెద్ద అంగలు వేయగలిగింది. వైద్యరంగానికి సంబంధించినంతవరకూ మనదేశంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని చాలా మంది భావించేవారు. అలాంటివారి భ్రమలన్నింటినీ.. కరోనా మహమ్మారి పటాపంచలు చేసింది. అత్యధికంగా వనరులున్న సంపన్నదేశాలతో పోల్చినా కూడా సమర్థంగా ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొంది. అతి తక్కువ సమయంలోనే 200 కోట్ల మందికి విజయవంతంగా టీకాలు వేయగలిగింది. టీకాలపై వ్యతిరేకత కూడా సంపన్నదేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువే. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు దేశం మొత్తం ఎలా ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కోగలదో.. కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ ప్రపంచానికి చూపింది.