ఘరానా దొంగలు : ఏసీ భోగీలే కొట్టేశారు !

indian railways lose entire premium ac and other coaches

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవితకి అనర్హం అన్నాడో మహా కవి మరి ఆయన్ని ఆదర్శం తీసుకున్నారో ఏమో గానీ ఈ ఘరానా దొంగలు చేసిన చోరీ ఇప్పుడు సంచలనంగా మారింది. రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఏసీ రైళ్లలో అయితే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవడం మనకి షరా మామూలే. అయితే మోడీ ప్రధాని అయ్యాక రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్‌లెట్ల’లోని స్టెయిన్‌లెస్‌స్టీల్‌ డస్ట్‌బిన్‌లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలలోని వస్తువులే కాధు ఏకంగా భోగీలు అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్త ఇప్పడు అందరినీ షాక్ లోకి నెట్టేస్తుంది.

అందుతున్న వివరాల ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్‌ యార్డు నుంచి మాయమైపోయాయి. రాజధాని, సంపర్క్‌ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్‌ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ మిస్సింగ్ వ్యవహరంలో రైల్వే అధికారుల వాదన మరోలా ఉంది. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ఆర్గనైజడ్ గ్యాంగ్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్‌ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. వీటిని మరో రైలుకు పొరపాటున అనుసంధానం చేసి ఉండొచ్చని ఈ కోచ్‌లు నార్తరన్ డివిజన్‌లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ నార్తరన్ రైల్వేకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే లేఖ రాసింది.త్వరలోనే అవి తిరిగి తమ వద్దకు చేరుకుంటాయని ఆ అధికారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది.