Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దీపావళికి ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో రవితేజ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో రాజశేఖర్ ‘గరుడవేగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. గరుడవేగ విడుదలై నాలుగు వారాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు ఒక్క మంచి సినిమా రాలేదు. వారంలో లెక్కకు మించి సినిమాలు వస్తున్నా కూడా ఒక్క సినిమా అయినా హిట్, బాగుంది అనిపించుకోలేదు. కొన్ని సినిమాలు పర్వాలేదు, కొన్ని సినిమాలు చెత్తగా ఉన్నాయి, మరి కొన్ని సినిమాలు బాబోయ్ అనిపించేలా ఉన్నాయి. మొత్తానికి మూడు వారాలుగా తెలుగు ప్రేక్షకులు సినిమాలు మంచివి లేక అల్లాడి పోతున్నారు.
‘గరుడవేగ’ వారం రోజుల పాటు సందడి చేసిన తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి ఆగిపోయింది. పెద్ద సంఖ్యలో సినిమాలు అయితే విడుదల అయ్యాయి. కాని ఒక్క సినిమా అయినా అందులో మంచి ఫలితాన్ని దక్కించుకోలేక పోవడంతో బాక్సాఫీస్ వద్ద గలగలలు వినిపించడం లేదు. ఈ వారంలో ఇంద్రసేన, జవాన్, ఆక్సీజన్ వంటి చిత్రాలు విడుదల అవుతున్నాయి. జవాన్‌పై కాస్త అంచనాలున్నాయి. మెగా మూవీ అవ్వడం వల్ల జవాన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఒక వేళ జవాన్ సినిమా ఫ్లాప్ అయితే మంచి హిట్ సినిమా కోసం క్రిస్మస్‌కు రాబోతున్న ‘హలో’ చిత్రం వరకు ఎదురు చూడాల్సిందే. ఈ మద్యలో వచ్చే సినిమాలు అన్ని కూడా గాలికి కొట్టుకు పోయే సినిమాలు అంటూ విశ్లేషకులు అంటున్నారు.