అయితే పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె స్వర్ణలత. ఈ మధ్యనే ఇంటర్ సెకండియర్ చదవి పరీక్షలు రాసింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైంది. దీంతో అప్పటినుంచి తీవ్ర మనస్తాపానికి గురైన కూతురిని తల్లిదండ్రులు సముదాయిస్తూ వచ్చారు. అయితే శనివారం నాడు తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం మరో గ్రామానికి వెళ్లడంతో స్వర్ణలత ఒంటరిగా ఇంట్లోనే తీవ్ర ఆవేదనకు లోనైంది. దీంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తల్లి ఇంటికి వెళ్లి చూడగా స్వర్ణలత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఆఘటనతో తల్లిదండ్రులు, ఆ ఊరు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక్కగా నొక్క బిడ్డ ఇకలేరన్న ఆవేదనతో తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖానకి లోనయ్యారు.