ఈ కాంగ్రెస్ నేతలు మారరా..?

internal-fighting-for-cm-post-in-t-congress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Internal Fighting For CM Post In T Congress

తెలంగాణలో అప్రతిహతంగా అధికారంలో ఉండాల్సిన పార్టీ. ఎన్నో త్యాగాలు చేసి, ఏపీని బలిపెట్టి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా.. ఏ మాత్రం బలపడకపోవడమే టీకాంగ్రెస్ ప్రత్యేకత. పైగా కేసీఆర్ చేతిలో సోనియాగాంధీ కూడా ఫూల్ అయిన సందర్భాన్ని ఆ పార్టీ నేతలు తేలిగ్గా మరిచిపోయారు. సర్కారుపై పోరాటం పక్కనపెట్టి.. అంతర్గత పోరాటాలకే పరిమితమౌతున్నారు.

ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా అధికారానికే దిక్కులేదు.. సీఎం పదవి కోసం కొట్టుకుంటున్నారు నేతలు. గత ఎన్నికలప్పుడు కూడా పార్టీలో ఇరవై మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని బిల్డప్ ఇచ్చి.. చివరకు అత్తెసరు ఫలితాలు సాధించి బోర్లా పడ్డారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నారని క్యాడర్లో నిర్వేదం నెలకొంది.

మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి మరీ.. పీసీసీ, సీఎల్పీ నేతలు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం అధిష్ఠానానికి చీకాకు తెప్పించిందట. మీ పనికిమాలిన పంచాయితీలు మానేసి.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని హస్తిన క్లాస్ పీకిందట. ఏమైనా తేడాలొస్తే ఈసారి ఫ్యూజులే కాదు.. తీగలు కూడా ఎగిరిపోతాయని, ఈసారి మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని అధిష్ఠానం తేల్చిచెప్పడంతో.. టీకాంగ్రెస్ నేతలు సర్దుకుని సొంతూళ్లలో పడ్డారు.

మరిన్ని వార్తలు:

చిన్నమ్మ తెలివి తెల్లారుతుందా..?

తొలి ఏకాదశి – విశిష్టత