Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణాలో డ్రగ్ మాఫియా కూసాలు కదిలిపోతున్నాయి. ఇప్పటిదాకా సెలబ్రిటీ హోదాలో బయటికి వచ్చినప్పుడు చేతులు ఊపిన వాళ్ళు, ఇప్పుడు కృత్రిమ నవ్వులు ముఖాన పులుముకుని ఎంత తొందరగా కెమెరాలకు అందకుండా పక్కకి తప్పుకుందామా అని చూస్తున్నారు. దీనంతటికీ కారణం ఆ ips అధికారి. పేరు అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు అయినవాళ్ళని అడిగితే ఆయన పవర్, బ్రెయిన్ ఎలా వుంటాయో చెప్తారు. 2001 ips బ్యాచ్ కి చెందిన సబర్వాల్ ఎక్కడ పని చేసినా తాను కూర్చునే కుర్చీ స్థానానికి వందకి వంద శాతం న్యాయం చేస్తారు. ఈ దూకుడు వల్లే ఇప్పుడు డ్రగ్స్ మాఫియా కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ మత్తులో చిక్కుకున్న బడా బాబులు తమ పేర్లు బయటికి రాకుండా చూసేందుకు చేయని ప్రయత్నాలు లేవు.
ఈ పరిస్థితుల్లో అకున్ సబర్వాల్ ని బెదిరించే సాహసానికి డ్రగ్స్ మాఫియా పూనుకున్నట్టు తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ సిమ్ నుంచి ఆయనకు కాల్ చేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సబర్వాల్ పిల్లలు, వాళ్ళు చదువుకునే స్కూల్ గురించి ప్రస్తావించి బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అకున్ సబర్వాల్ దూకుడుతో కకావికలమవుతున్న డ్రగ్ వ్యాపారులు ఈ విధంగా బెదిరింపులకు దిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అటు అకున్ ఈ పరిణామంతో ఇంకా దూకుడు పెంచడానికే డిసైడ్ అయ్యారట. మొత్తానికి సినిమా జనానికి సబర్వాల్ దూకుడుతో అసలు సిసలు సినిమా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు