Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిందా..? ముఖ్యంగా రాజధాని జిల్లాలలో సీట్లు పెంచుకోవడానికి గాను జగన్ వ్యూహం ఇదేనా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అధికార తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తంతో పోల్చుకుంటే రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన్ కి అనూకూలం అని వైసీపీ చెప్పుకునే రెడ్డి సామాజిక వర్గం రాజధాని ప్రాంతంలో ఉన్నా గెలుపోటములని శాసించే స్థాయిలో వారు లేరు. దీంతో రాజధాని ప్రాంతంలో సీట్లు గెలవాలి అంటే కమ్మ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తులకు సీట్లు ఇవ్వాలి అందుకే ప్రధాన పార్టీలు ఇదే పంధాని కొనసాగిస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా దాదాపు కమ్మసామాజిక ఎమ్మెల్యేలే. దీనితో ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మ ఓటు బ్యాంకు పై కన్నేసిన జగన్ ఇప్పుడు వరుసగా కమ్మ సామాజ్జిక వర్గ నేత్ఘలతో చంద్రబాబును తిట్టిస్తున్నారు. నిన్న పోసాని చంద్రబాబు మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ విషం కక్కారు అయితే అ వార్తలు వార్తా స్రవంతి నుండి పూర్తిగా కనుమరుగు కాకముందే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు వైసీపీ నేత కమ్మ సామాజిక వర్గానికే చెందినా మరో నేత ఆదిశేషగిరిరావు మరో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద మరిన్ని విమర్శలు చేశారు.
కుట్రలు, మోసాలకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరని ఆదిశేషగిరి రావు విమర్శించారు. నవ నిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని తన అసరమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంతో పాటు ప్రతిపక్షంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ చేస్తోన్న పోరాటం చూసి చంద్రబాబులో అభద్రతా భావం నెలకొందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టు సాధించిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు.
నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఏంచేశాడు. ప్రత్యేక హోదా కోసం మొట్ట మొదటి నుండి పోరాడుతుంది వైసీపీనేనని అలాగే పోలవరం కోసం చంద్రబాబు చేసిందేం లేదని ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ఘనత వైయస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశించిన చోట నుండి పోటీ చేస్తానని అలాగే కొందరు మహేష్ బాబు తెలుగుదేశానికి మద్దతు అంటున్నారని కానీ మహేష్ బాబుకు అసలు రాజకీయాలతో సంబంధం లేదని ఆయన అన్నారు.
దాదాపు 30 పైగా స్థానాలు ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైకాపాకు ఓట్ల శాతం చాల తక్కువగా ఉంది. అయితే రాజధాని ప్రాంతాన్ని జగన్ వ్యతిరేకించడం దొనకొండ ఏరియాని సూచించడంతో ఆయనకు వ్యతిరేకత అదేస్థాయిలో వ్యక్తమవుతుంది. అందుకే ఆ వ్యతిరేకతను పోగొట్టి కమ్మ సామాజిక వర్గ వోట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ మరిన్ని పావులు కడుపుతునట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కి ఇదే తరహా సూచనలు చేసినట్టు వైసీపీ అంతర్గత చర్చల్లో వినపడుతోన్న మాట. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎక్కువగా ఉండటంతో మరి ఆ పార్టీకి ఏ మేరకు విజయావకాశాలు ఉన్నాయనేది చూడాలి. ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్న అసంతృప్త నేతలపైనే జగన్ ఎక్కువగా గురి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమందితో సమాలోచనలు జరిపినట్లు వైకాపా వర్గాలు మీడియా లీక్ లు ఇస్తున్నాయి.
అయితే ఈ కమ్మ వోట్ బ్యాంక్ అంత ఈజీగా జగన్ ని నమ్ముతుందా ? అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో కేవలం కమ్మ వర్గానికి చెందినా వారే కాక ఇతర వర్గాలకి చెందిన వారు కూడా జగన్ అనుభవం మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఇద్దరు కమ్మ వర్గపు వారిని రంగంలోకి దింపి రాజధాని ప్రాంతంలోనే ప్రెస్ మీటలు పెట్టిస్తుండడం ఇప్పుడు అనేక చర్చలకు దారి తీస్తోంది.