ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల మధ్య స్నేహం ఉన్నట్టా ? లేనట్టా ?

NTR
NTR

ఒకప్పుడు ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల మంచి స్నేహితులు. ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కడో ఒక చోట .. ఏదో ఒక పాత్రలో రాజీవ్ కనకాల కనిపించేవాడు. ఆ తరువాత కాలంలో రాజీవ్ ను ఎన్టీఆర్ దూరం పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో మాదిరిగా ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనిపించలేదు కూడా. దాంతో అంతా కూడా ఇది నిజమనేని అనుకున్నారు.

‘ఐ డ్రీమ్’ వారికి రాజీవ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్ననే ఎదురైంది. అందుకు రాజీవ్ స్పందిస్తూ .. “ఎన్టీఆర్ తో నా స్నేహం అలాగే ఉంది. తనకి ఇప్పుడున్న కమిట్ మెంట్లు .. బాధ్యతలు ఎక్కువ. అందువలన గతంలో మాదిరిగా కలుసుకోవడం లేదంతే. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేసేది నేనే కదా. రీసెంట్ గా కూడా షూటింగుకు రమ్మని కాల్ చేశాడుగానీ .. వీలుపడక పోవడం వలన నేను వెళ్లలేదు” అని అన్నాడు.

“ఎన్టీఆర్ తరువాత నేను ఎక్కువగా చనువుగా ఉండే స్నేహితులతో తరుణ్ .. మనోజ్ .. శివబాలాజీ కనిపిస్తారు. తరుణ్ కి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. తాను తలచుకుంటే రీ ఎంట్రీ ఇవ్వచ్చు. ఇక నా కెరియర్ విషయంలో కూడా నేను సంతృప్తికరంగానే ఉన్నాను. గతంలో ఒకే రకమైన పాత్రలు వచ్చినా, ట్రెండు మారడంతో కొత్త పాత్ర