దేశంలోని హిందూ నేతలను హతమార్చేందుకు పెద్ద జరిగిన కుట్ర బట్టబయలు అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) కలకలం రేపింది. కోయంబత్తూరులో ఈ రోజు పోలీసులు ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని హిందూ మక్కల్ కట్చి(హెచ్ఎంకే) చీఫ్ అర్జున్ సంపత్ తో పాటు ఇతర నేతలను హత్యచేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. వీరంతా చెన్నై నుంచి కోయంబత్తూరు రావడంతో వారి వ్యవహారాన్ని గమనించిన నలుగురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(ఎస్‌ఐయూ) పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రెండు వారాల పోలీస్ కస్టడీకి అప్పగించింది. కోయంబత్తూరులో అరెస్టయిన ఈ ఐదుగురు వినాయకచవితి సందర్భంగా అర్జున్ సంపత్ తో పాటు ఇతర అగ్ర నేతలను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని పోలీసులు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో అధికారులు రాష్ట్రమంతటా హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రమూకలు ఆశ్రయం పొందుతున్నాయనీ, అవసరమైతే కేంద్రం సాయం చేస్తుందని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కొన్నిరోజుల క్రితం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు.