Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రోజురోజుకీ ఐటీ ప్రభ మసకబారుతోంది. ఇప్పటికే పింక్ స్లిప్పులతో ఉద్యోగులు భయపడుతుంటే.. ఇప్పుడు ఇంక్రిమెంట్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయని సర్వే చెబుతోంది. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ లాగా ప్రతి ఏటా వృద్ధి సాధిస్తున్న ఫార్మా రంగం.. ఐటీని వెనక్కినెట్టేసింది.
ఐటీలో జాబులు మారడం సర్వసాధారణం అయినా.. ఈసారి మాత్రం వలసల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పింక్ స్లిప్పులు, రిజర్వ్ బెంచ్ ఊస్టింగులు, తక్కువ ఇంక్రిమెంట్లతో, ఉద్యోగ భద్రత లేకపోవడంతో చాలా మంది ఇతర కంపెనీలకు వలసపోతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఫార్మాలో చాలా తక్కువ వలసలు ఉన్నాయి.
గతంలో ఐటీ సెక్టార్లో 20 నుంచి 30 శాతం ఇంక్రిమెంట్లు ఉండేవి. కానీ ట్రంప్ పుణ్యమా అని ఈసారి ఎప్పుడూ లేని విధంగా తొమ్మిది శాతానికే పరిమితమయ్యాయి. అన్ని రంగాల కంటే ఫార్మాలో మాత్రమే ఇంక్రిమెంట్లు పది శాతం పైన నమోదయ్యాయి.
మరిన్ని వార్తలు: