Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి తీసుకుని తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న దాని మీద తాము పెత్తనం చలాయించాలని చూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మొత్తానికి ఆద్యుడు ఒకప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీటీడీ ఈవో గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకి తెర లేపింది. అమరావతి విషయంలో ప్రభుత్వంతో ఉన్నంత వరకు ఓక మాట మాట్లాడి బయటకి వచ్చి వైసీపీ, జనసేనతో కలిసి అడ్డుకుంటున్న మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్ కృష్ణారావే టీటీడీని కేంద్రానికి అప్పగించాలని పలు నివేదికలు అంద చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి తిరుమల అవసరం లేదని, కేంద్రం ఆధీనంలో ఉంచుకోవాలని టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఐవైఆర్ కృష్ణారావు ఈ వివాదాస్పద సిఫార్సులు చేయగా అప్పటిలో టిటిడి బోర్డ్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ, బీజేపీ నేతలతో మాట్లాడి కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి మరల ఆ సిఫార్సుల అమలుకు ఆదేశాలు ఇప్పించింది కృష్ణారావే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆనాడు ఐవైఆర్ రహస్యంగా రూపొందించిన ఆ నివేదికలో ఏమున్నాయి? ఇప్పుడు వాటిని అమలు చేయటం వలన అసలేమి జరగనుంది అనే విషయాలు పరిశీలిస్తే పలు కీలక విషయాలు బయటకి వచ్చాయి.
ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గి వేరే ఉత్తర్వులు ఇచ్చినా కర్నాటక ఎన్నికల తర్వాత మరో సారి ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తిరుమలను పురావస్తు శాఖకి అప్పగిస్తే ఇకపై వెంకన్న ఆలయం ముందు పందిరి వేయడానికి గొయ్యి తవ్వాలన్నా, అనుమతి కోసం ఢిల్లీకి లేఖ రాయాల్సిందే! గుడి చుట్టూ ఇప్పుడు ఉన్న క్యూ లైన్ సరిపోవడంలేదని, దానిని మరింత వెడల్పు చేయాలని నిర్ణయించారా? ఢిల్లీ నుంచి అనుమతి రావాల్సిందే! గుడి చుట్టూ ఉన్న రోడ్డు మీద సిమెంటు వేయాలా? ఢిల్లీ పెద్దలు కరుణించాల్సిందే. ఇలా ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూసే ఈ కీలక ప్రక్రియని 2011 లో ఈవోగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు పంపిన ప్రతిపాదనలు ఇప్పుడు అమలు చేయాలని కేంద్రం భావించటం వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమయినా ఏడుకొండల వాడి జోలికి వస్తే మోడీకి ఇక పుట్టగతులు ఉండవు అని ఇప్పటికే వెంకన్న సాక్షిగా మోడీ ఇచ్చిన మాట తప్పి తప్పుచేసాడని ఇప్పుడు తిరుమల జోలికి వస్తే మోడీ ఏమయిపోతాడో అని సామాన్య ప్రజానీకం వాపోతున్నారు .