Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రుల సరికొత్త రాజధాని అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతున్న మాట.అయితే ఈసారి తొలకరి వానలు ముందుగానే ఏపీని పలకరించాయన్న సంతోషం సీఎం చంద్రబాబుకి లేకుండా చేసింది అమరావతిలో తాత్కాలిక రాజధాని భవన నిర్మాణం.కుంభ వృష్టిగా కురిసిన వానతో రాజధాని లోని అసెంబ్లీ సహా ఇతర భవనాల్లో వాన నీళ్లు రావడం,నిర్మాణాల పెచ్చులు ఊడటం చూసి కట్టడపు నాణ్యత మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.సాక్షి చెబుతున్న దాని ప్రకారం ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ నీటిమయం అయ్యింది.బకెట్స్ తో ఆ నీటిని తోడిపోస్తున్న దృశ్యాల్ని సాక్షి ప్రసారం చేస్తోంది.
సమస్య చిన్నదైతే దాన్ని పెద్దగా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.ఆ వాదనకు బలం చేకూరే ఘటనలు ఏమీ కనిపించడం లేదు.ఈ ఉదయం నుంచి అసెంబ్లీ ప్రాంగణం లోకి వెళ్లేందుకు వైసీపీ బృందం,విలేకరులని వెంటబెట్టుకుని వెళ్ళింది.కానీ అసెంబ్లీ భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు ధర్నాకి దిగారు.పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.వైసీపీ ఆరోపిస్తున్నట్టు తాత్కాలిక భవనాల ప్రమాణాలు నాసిరకంగా ఉంటే ఈరోజు కాకపోయినా ఇంకోరోజు బయటపడతాయి.అసలు అసెంబ్లీ జరిగే రోజుల్లోనే భారీ వర్షం పడితే ఈ తంతు చూడకుండా ఎవరినీ ఆపలేరు.ఇప్పటిదాకా టీడీపీ సర్కార్ మీద ఎన్ని విమర్శలు వస్తున్నా అమరావతి,అభివృద్ధి అనే అస్త్రాలతో ప్రభుత్వం నెట్టకొస్తోంది.ఇవే పరిణామాలు పునరావృతమైతే ఆ అస్త్రం టీడీపీ చేజారినట్టే.అమరావతికి చిల్లు పడినట్టే.