Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పశ్చిమగోదావరి జిల్లా గంగల పర్రులో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. దళితుల్ని వెలేసిన ఘటనపై బాధితుల్ని పరామర్శించారు. కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ దూకుడుగా ఉండే జగన్ ఇక్కడ మాత్రం కులాల లెక్కల్ని జాగ్రత్తగా కౌంట్ చేశారు. జాగ్రత్తగా హోమ్ వర్క్ చేసి మరీ ప్రసంగానికి ప్రిపేరై వచ్చినట్లు తెలిసిపోయింది. గత ఎన్నికల్లో పోలైన ఓట్లను దృష్టిలో పెట్టుకుని జగన్ మాట్లాడారు.
ఈ జిల్లాలో క్షత్రియ సామాజికవర్గం గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది. అందుకే ఒక్క సీటు కూడా జగన్ కు రాలేదని విశ్లేషకుల అంచనా. ఇప్పుడు దళితుల పక్షాన మాట్లాడితే… క్షత్రియులకు కోపమొస్తుంది. క్షత్రియుల తరపున వకాల్తా పుచ్చుకుంటే ఇంక మీరెందుకొచ్చారని దళితులు ప్రశ్నిస్తున్నారు. అందుకే చాలా సంకట స్థితిని ఎదుర్కున్న జగన్ ఆచితూచి ప్రసంగించారు.
క్షత్రియులకు నొప్పి కలగకుండా, దళితులకు ఓదార్పు ఇస్తున్నట్లుగా జగన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కులాల మధ్య కుమ్ములాటలు ఉండకూడదని, కొందరు చేసిన తప్పును కులం మొత్తానికి అంటగట్టొద్దని జగన్ సిసలైన పరిణతి చెందిన పొలిటీషియన్ గా మాట్లాడటం వైసీపీ వర్గాల్నే ఆశ్చర్యపరిచింది. జగన్ తన పొలిటకల్ కెరీర్లోనే ఇంత మెచ్యూర్డ్ ప్రసంగం చేయలేదన్న మాట వినిపించింది.
మరిన్ని వార్తలు: