Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఊరకరారు మహానుభావులు అనేది పాత సామెత. ఊరక పిలవరు మహానుభావులు అన్నది కొత్త సామెత. ఈ సూక్ష్మం ఎరగని వైసీపీ అధినేత జగన్ ఓ పెద్దాయన చెప్పిన ఒక్క అవసరార్ధపు మాట విని రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసుకున్నాడు. అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి ఎన్నికల వాతావరణం అలుముకుంటున్న వేళ, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కన్నా జగన్ బలపడుతున్నాడని సోషల్, జాతీయ మీడియా కోడై కూస్తున్న వేళ … ఎప్పటి నుంచో జగన్ ఆశించిందే జరిగింది. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారు అయ్యిందని పీఎంఓ కార్యాలయం నుంచి జగన్ కి ఫోన్ వచ్చింది. ఆఘమేఘాల మీద జగన్ ఢిల్లీలో వాలిపోయారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మాటల సందర్భంగా పార్టీ పరిస్థితి ఎలా వుంది అని మోడీ ఆరా తీసారట. అందుకు సూపర్ అని జగన్ జవాబు ఇచ్చారట. 2018 చివరిలో ఎన్నికలు వచ్చే అవకాశం వుంది జాగ్రత్తగా చేసుకోమని మోడీ అన్న ఒకే ఒక్క మాటతో జగన్ చాలా ఊహించేసుకున్నారు. బయటికి వచ్చిందే తడవు బీజేపీ భజన మొదలెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ చంద్రబాబుని వదిలేసి తనతో వచ్చి కలుస్తుందని ఊహించారు. అందుకు తగ్గట్టే రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అతి ఉత్సాహం ప్రదర్శించారు.
దీంతో అప్పటిదాకా జగన్ లో కేంద్రాన్ని ఢీకొట్టే ఓ హీరోని చూసిన మైనార్టీలు, ఎస్సీలు కమలనాధులతో ఈయన డ్యూయెట్స్ చూడలేకపోయారు. ఇక బీజేపీ డబల్ గేమ్ చూసి టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తుంటే నంద్యాల, కాకినాడ ఎన్నికల రూపంలో అది రానే వచ్చింది. ఆ ఫలితం చూసి బీజేపీ టీడీపీకి జై కొట్టింది .జగన్ కి షాక్ తగిలింది. వంట చేసేటప్పుడు పక్కింటివాడిని రుచి చూడమని పిలిచి తీరా విందుకు పిలవకుండా ఉన్నట్టు బీజేపీ చేసిన పని, మోడీ చెప్పిన ఆ ఒక్క మాట జగన్ రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసింది.