Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ గుండెల్లో ఫిరంగులు పేలుతున్నాయి.ఓ సర్వే ఇంత పని చేసిందని తెలుస్తోంది.తాను డబ్బులిచ్చి హైర్ చేసుకున్న ప్రశాంత్ కిషోర్ పూర్తి ప్రొఫెషనల్ గా నిర్వహించిన సర్వే ఫలితాలు చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారట.ఇంతకీ ఆ సర్వే లో జనాభిప్రాయం ఎలా వుందో తెలుసుకోవాలనుందా?
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రశాంత్ టీం సర్వే నిర్వహించిందట.ప్రతి నియోజకవర్గం నుంచి 500 మందిని 20 ప్రశ్నలతో ఈ సర్వే నిర్వహించారు.మే నెల రెండో అర్ధభాగంలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు చూసి వైసీపీ షాక్ లో ఉందట.
మొత్తం 175 స్థానాలకు గాను 41 శాతం ఓట్లతో అధికార టీడీపీ తన మిత్రపక్షం బీజేపీ తో కలిసి 114 స్థానాల్లో తిరిగి గెలుస్తుందట.ఇక వైసీపీ కేవలం 29 శాతం ఓట్లతో 49 స్థానాలకే పరిమితం అవుతుందట.ఇక కొత్తగా 2019 ఎన్నికల బరిలోకి దిగబోతున్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పది సీట్లు గెలుచుకుంటుందట.ఆ పార్టీ దాదాపు 13 శాతం ఓట్లు రాబట్టుకుంటుందట. ఇలా వైసీపీ ఊహించని ఫలితాలు రావడానికి కారణాల్ని కూడా ప్రశాంత్ టీం బయటపెట్టిందట.
ప్రశాంత్ కిషోర్ బృందం జరిపిన సర్వే లో టీడీపీ కి అనుకూలంగా,వైసీపీ కి ప్రతికూలంగా మారిన పరిణామాలు ఇవే ..
1 .రైతు రుణ మాఫీ అంశంలో బాబు సర్కార్ మీద అసంతృప్తి వున్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేదని జనం అర్ధం చేసుకుంటున్నారు.
2 . పోలవరం,పెన్షన్,రాజధాని అంశాల్లో చంద్రబాబు ఎక్కువ మార్కులు రాగా,వాటిని జగన్ వ్యతిరేకిస్తున్నట్టు జనాలు భావిస్తున్నారు.
3 .ప్రజా సమస్యల పై కన్నా వ్యక్తిగత అంశాల మీదే జగన్ అండ్ టీం దృష్టిపెడుతున్నట్టు ప్రజలు విశ్వసిస్తున్నారు.
4 .వైసీపీ లో రోజా,చెవిరెడ్డి,భూమన వంటి నేతల దూకుడు ఆ పార్టీకి కీడే చేస్తోంది.
5 .వైసీపీ కి ఓటేసే వారిలో కూడా కేవలం 40 శాతం మందే జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు . మిగిలిన 60 శాతం వేర్వేరు కారణాలతో ఆ పార్టీకి ఓటేస్తున్నారు.
6 .కాపులు,బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా అందుతున్న సాయం మీద ఆ వర్గాల్లో సంతృప్తి వుంది.
7 .కాపు రిజర్వేషన్ అంశంలో జగన్ కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.
8 .మోడీతో భేటీ తర్వాత జగన్ మీద క్రిస్టియన్,మైనారిటీల్లో నమ్మకం తగ్గింది.కేసులకోసం జగన్ బీజేపీ తో కలవొచ్చని వారు అనుమానిస్తున్నారు.
9 .వైసీపీ కి దూరమయ్యే ఈ వర్గాలు జనసేన,కాంగ్రెస్ వైపు చేస్తున్నాయి.
10 .జనసేన ప్రభావం యువతలో ఉన్నంతగా మిగతా వర్గాల్లో లేదు.