Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కి జగన్ బ్యాచ్ నుంచి ఊహించని షాక్ తగిలింది. రిజర్వేషన్ అమలు కోసం చంద్రబాబు సర్కార్ డిసెంబర్ 6 డెడ్ లైన్ గా పెట్టిన ముద్రగడ ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహం రూపొందించాలని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి జగన్ బ్యాచ్ తన వద్దకు వస్తున్నట్టు ఓ కబురు వచ్చిందట ముద్రగడకి. వైసీపీ సపోర్ట్ కూడా డైరెక్ట్ గా దొరికితే ఈసారి విరగదీయొచ్చని ముద్రగడ కూడా అనుకున్నారట. అయితే ఆయన అనుకున్నట్టు ఆ బ్యాచ్ ముద్రగడ దగ్గరికి వెళ్ళలేదు గానీ జగన్ సన్నిహితుడు ఒకరి నుంచి ఫోన్ మాత్రం వచ్చిందట. ఆ ఫోన్ లో మ్యాటర్ తెలుసుకున్న ముద్రగడ మొహం మాడిపోయిందట. ఇంతకీ ఆ ఫోన్ లో మాట్లాడిన మహానుభావుడు ఏమి చెప్పాడో తెలుసా .
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డిసెంబర్ 6 డెడ్ లైన్ తర్వాత ఏదో మొక్కుబడి ప్రకటనతో సరిపెట్టాలి తప్ప ఏ మాత్రం సీరియస్ స్టెప్ తీసుకోడానికి వీల్లేదని సదరు నాయకుడు కోరాడట. కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరిట జనం దృష్టి మళ్లితే జగన్ పాదయాత్రకు రావాల్సినంత మైలేజ్ రాదని కూడా సదరు నేత గొణిగాడట. దీంతో విస్తుపోయిన ముద్రగడ మీరే కదా ఈ ఉద్యమానికి అండగా ఉంటామని చెప్పింది, ఇప్పటికే డెడ్ లైన్స్ మార్చి మార్చి జనంలో విశ్వసనీయత పోతోందని ముద్రగడ బదులివ్వడంతో ఆ నాయకుడు వీటికి నేరుగా జవాబు ఇవ్వకుండా జగన్ కి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పేసి ఫోన్ కట్ చేసారంట.
ఈ విషయాన్ని ముద్రగడ తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారట. వైసీపీ మాట నమ్ముకుని చంద్రబాబు సర్కార్ తో యుద్ధానికి దిగితే ఇప్పుడు మధ్యలో హ్యాండ్ ఇస్తున్నారని వాపోతున్నారట. అటు చంద్రబాబు సర్కార్ తనతో కక్ష గట్టింది, పదేపదే పాదయాత్ర వాయిదాలు తో జనంలో విలువ తగ్గిపోయింది, జగన్ బ్యాచ్ హ్యాండ్ ఇస్తోంది …ఇలా ఆలోచిస్తున్న ముద్రగడ అనవసరంగా వైసీపీ వల్లో పడ్డానని తెగ బాధపడిపోతున్నారట.