ప్రతిపక్ష నేత జగన్ మీద విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగింది. రేపు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సిన జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. అయితే ఆయన ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఉండగా అనూహ్యంగా ఒక వెయిటర్ కత్తి తో దాడి చేసే ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ వ్యక్తిని ఎఇర్ పోర్ట్ లో పనిచేసే ఒక వెయిటర్ అయిన శ్రీనివాస్ గా గుర్తించినట్టు తెలుస్తోంది. అతడు స్థానిక క్యాంటిన్లోనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. అయితే, ఈ దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ ఎవరు, ఎందుకు ఇలా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సెల్ఫీ తీసుకుంటానంటూ అతడు జగన్ దగ్గరకి వచ్చినట్టు సమాచారం. ఆ తరువాత, అనూహ్యంగా జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. వెంటనే జగన్ అలెర్ట్ అయి పక్కకు జరిగారు, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో శ్రీనివాస్ చేతిలో ఉన్న చిన్నపాటి కత్తి జగన్ భుజానికి తాకి, గాయమైంది. ఈ దాడితో వైకాపా వర్గాలన్నీ ఒక్కసారి షాక్ అయ్యాయని చెప్పొచ్చు. ఇది భద్రతా వైఫల్యమంటూ వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇక్కడే కొన్ని అనుమానాలని నెటిజన్లు లేవనేత్తుతున్నారు.
వారి వాదన ప్రకారం ఇప్పటి వరకూ లైట్ తీసుకున్న ఆపరేషన్ గరుడ నిజమవుతోందా….??
వైయస్ జగన్ పై దాడి ఏం చెబుతోంది..?? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా…??
అలాగే మరి కొందరు ఆ యువకుడిది అమలాపురం అని పవన్ అభిమాని అని, పవన్ పెళ్ళిళ్ళ మీద వ్యాక్యాలు చేసినందుకే ఇలా పొడిచాడని అంటున్నారు.
మరో వర్గం అసలు ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చిందని, నిరంతరం బౌన్సర్ ల వలయంలో ఉండే జగన్ మీద ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నిస్తూన్నారు ?