Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయినప్పటికీ ప్రకాశం , నెల్లూరు సహా సీమ జిల్లాల్లో ఆ పార్టీ గట్టి ప్రభావమే చూపింది. అయితే రాయలసీమలో అనంతపురం జిల్లాలో మాత్రం ఆ పార్టీ కి చావు దెబ్బ తప్పలేదు. అందుకు ప్రధాన కారణం ఆ జిల్లాలో పరిటాల కుటుంబం మీదున్న అభిమానం అని జగన్ భావిస్తున్నారట. పైగా వచ్చే ఎన్నికల్లో సునీతమ్మ తనయుడు శ్రీరామ్ కూడా ఎన్నికలబరిలోకి దిగొచ్చని ఇప్పటికే టాక్ వచ్చింది. దీంతో జిల్లాలో టీడీపీ అనుకూల వాతావరణం ఏర్పడుతుందని జగన్ భయపడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే , జిల్లా అంతటా పరిటాల కుటుంబం తిరగకుండా చూడాలి అనుకుంటున్నారట. పరిటాల సునీతమ్మ , శ్రీరామ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తే వాళ్ళు జిల్లా అంతటా దృష్టి పెట్టే అవకాశం ఉండదని అనుకుంటున్నారు.
జగన్ తాజా వ్యూహాన్ని తన పాదయాత్ర నుంచే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అనంత జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ జేసీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి లో కేవలం 13 .5 కిలోమీటర్లు నడుస్తారు. కానీ మంత్రి పరిటాల సునీతమ్మ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన రాప్తాడు నియోజకవర్గంలో దాదాపు 45 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయబోతున్నారు. ఇక రాప్తాడులో వైసీపీ అభ్యర్థిగా ప్రచారం లో వున్న ప్రకాష్ రెడ్డి కి అన్ని విధాలుగా జగన్ అండగా ఉంటున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్ పోటీ చేసే నియోజకవర్గం మీద ఓ క్లారిటీ వచ్చాక జగన్ అక్కడ కూడా స్పెషల్ గా దృష్టి పెట్టే అవకాశం వుంది. అభ్యర్థి ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట. ఏదేమైనా పరిటాల కుటుంబం మీద జగన్ కాన్సంట్రేషన్ ఆసక్తి రేకెత్తిస్తోంది.