Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాది సమయం మాత్రమె ఉండడంతో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నిన్నమొన్నటి వరకు ప్రధాన పోటీ వైకాపా తెదేపా మధ్యనే ఉందని భావించిన అందరికీ నేనూ పోటీలో ఉన్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగాడు. జనసేన రాకతో ముక్కోణపు పోటీ తప్పదని తేలిపోవడంతో ఇక ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత ఏపీ సీఎం ఎవరు? అనే దాని మీద ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఇప్పుడు వైకాపా నేత అంబటి రాంబాబు చెప్పిన లాజిక్ ప్రకారం కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి యే నట.
ఎందుకంటే పాదయాత్ర చేసే ప్రతిపక్ష నేత సీఎం అయ్యే సెంటిమెంటు ఏపీలో ఉందని వైఎస్ రాజశేఖరెడ్డి మొదలు చంద్రబాబునాయుడు దాకా అలా పాదయాత్రల తరువాత సీఎం అయ్యారని.. ఇప్పుడు జగన్ కూడా అదే సెంటిమెంట్ ప్రకారం సీఎం కానున్నారని అంబటి సరికొత్త లాజిక్ చెప్పారు. మన సభలకు జనం వస్తున్నారని 2019లో అధికారం మనదే అనే మితిమీరిన విశ్వాసానికి పోవద్దని, జగన్ కష్టాన్ని అందరికీ వివరిస్తేనే ఎన్నికల్లో విజయం సాధిస్తామని వైసీపీ నేత అంబటి రాంబాబు కార్యకర్తలతో అన్నారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దని బలమైన వ్యూహంతో ప్రజలను తనవైపు తిప్పుకోగలడన్నారు.