చంద్రబాబు తమ ఏకైక అజెండా కావడంతో దానికోసం జగన్ కేసీఆర్ లు చేతులు కలిపిన సంగతి తెల్సిందే. అయితే ఇక్కడ జగన్ మరచిపోతున్న విషయం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో జగన్ కి జరిగిన చేదు అనుభవం బహుశా ఏ రాజకీయ నాయకుడికీ జరిగి ఉండదు. మహబూబాబాద్ లో పర్యటన కోసం జగన్ బయల్దేరితే ఆయన వస్తున్నారనే విషయం మానుకోటలో రణరంగం సృష్టించాయి టీఆర్ఎస్ వర్గాలు. రైల్లో హైదరాబాద్ నుంచి మానుకోట బయల్దేరిన జగన్ అక్కడి రణరంగాన్ని తలపించే సరికి వెనుదిరిగి పోయిన సంగతి తెల్సిందే. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా మానుకోట వెళ్లబోతుండగా జగన్కు, కొండా సురేఖకు చుక్కలు చూపించింది టీఆర్ఎస్. ఫలితంగా మళ్లీ తెలంగాణ వైపు చూడటానికే భయపడిపోయింది వైసీపీ పార్టీ. అదే తెలంగాణలో వైసీపీ పతనానికి తొలి అడుగు.
అలాంటిది ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతూ వెళ్తున్నారు జగన్. తరిమి తరిమి కొట్టిన గులాబీ నేతలకు ఆంధ్రలోకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేం విచిత్రమో జగన్ కే తెలియాలి మరి. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే సామెతని నిజం చేస్తూ జగన్ ముందుకు వెళుతున్నారు. ఎవరైతే తనను తరమికొట్టారో వాళ్లనే ఇప్పుడు సొంత రాష్ట్రంలోకి ఆహ్వానించాల్సిన పరిస్థితిలో ఉన్నారు జగన్. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలోకి రావడానికి మార్గం సుగమం చేసుకున్నారు. వైపో ఒకరి వైపు ఉండక తప్పదని కేసీఆర్ వైపు చూస్తుంటే.. ప్రజలతో పాటు ఆయన సొంత సామాజిక మార్గంలో అంతకు మించి సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఏమి జరుగుతుందో ఏమో ?