Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల విషయంలో వైసీపీ అధినేత జగన్ అన్ని విషయాల్లో ముందుంటున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది నెలల నుంచే మళ్లీ ఎన్నికలు అనే పాట మొదలెట్టారు. ఇక రెండేళ్ల ముందుగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని బరిలోకి దించారు. ప్లీనరీ వేదికగా ఆయన్ని అందరికీ పరిచయం చేయడమే కాదు ప్రశాంత్ చెప్పినట్టు టిక్కెట్ల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి లోనైన ఎమ్మెల్యేలు పోను వైసీపీ లో ప్రస్తుతం 46 మంది వున్నారు. అయితే ఈ సిట్టింగుల్లో కేవలం 30 మందికి మాత్రమే 2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కుతాయంట. మిగిలిన 16 మందికి జగన్ హ్యాండ్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది. ప్రశాంత్ సూచనలకి అనుగుణంగా ఈ జాబితా తయారు అయ్యిందని చెప్పుకుంటున్నారు.
2019 లో వైసీపీ టిక్కెట్లు దొరికే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరో మీరే చూడండి.
1. విశ్వరాయి కళావతి – పాలకొండ (శ్రీకాకుళం)
1. పాముల పుష్పా శ్రీవాణి – కురుపాం (విజయనగరం)
3. కే రాజన్నదొర – సాలూరు (విజయనగరం)
4. బి. ముత్యాల నాయుడు – మాడుగల (విశాఖపట్నం)
5. దాడిశెట్టి రాజా – తుని (తూగో జిల్లా)
6. చిర్ల జగ్గిరెడ్డి – కొత్తపేట (తూగోజిల్లా)
7. కొడాలి నాని – గుడివాడ (కృష్ణా జిల్లా)
8. ఆళ్ల రామకృష్ణారెడ్డి – మంగళగిరి (గుంటూరు)
9. కోనా రఘుపతి – బాపట్ల (గుంటూరు)
10. ముస్తాఫా – గుంటూరు ఈస్ట్ (గుంటూరు)
11. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి – మాచర్ల (గుంటూరు)
12. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి – నరసారావు పేట (గుంటూరు)
13. ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి – కావలి (నెల్లూరు)
14. అనిల్ కుమార్ యాదవ్ – నెల్లూరు సిటీ (నెల్లూరు)
15. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి – నెల్లూరు రూరల్ (నెల్లూరు)
16. కాకాణి గోవర్థన్ రెడ్డి -సర్వేపల్లి
17. కోరుముట్ల శ్రీనివాసులు – కోడూరు (కడప)
18. గడికోట శ్రీకాంత్ రెడ్డి – రాయచోటి (కడప)
19. రాచమల్లు ప్రసాద్ రెడ్డి – ప్రొద్దుటూరు (కడప)
20. వైఎస్ జగన్మోహన్ రెడ్డి – పులివెందుల (కడప)
21. ఎక్కలదేవి ఐజయ్య – నందికొట్కూరు (కర్నూలు)
22. గౌరు చరితా రెడ్డి – పాణ్యం (కర్నూలు)
23 .బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – డోన్ (కర్నూలు)
24. వై సాయి ప్రసాద్ రెడ్డి – ఆధోని (కర్నూలు)
25. వై విశ్వేశ్వర్ రెడ్డి – ఉరవకొండ (అనంతపురం)
26. చింతల రామచంద్రారెడ్డి – పీలేరు (చిత్తూరు)
27. దేశాయి తిప్పారెడ్డి – మదనపల్లి (చిత్తూరు)
28. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పుంగనూరు (చిత్తూరు)
29. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి – చంద్రగిరి (చిత్తూరు)
30. ఆర్కే రోజా – నగరి (చిత్తూరు)
మరిన్ని వార్తలు