వైసేపీ ప్లాన్ ని ఈసీ బయటపెట్టిందిగా…!

Jagan Gives Clarity On Federal Front

ఏపీలో ఎలాగైన అధికారం చేపట్టాలని అనుకుంటున్న వైసీపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. దీని కోసం ఇతర పార్టీలకు చెందిన నేతలకు ఎర వేయడం బీజేపీతో రహస్య ఒప్పందాలు సైతం చేసుకుంది. జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో బిజీగా ఉంటే కొందరు ముఖ్య నేతలు మాత్రం చేయవలసిన పనినంతా చక్కబెడుతున్నారట. 2019లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే అనేక వ్యూహాలు అమలు చేస్తోంది వైసీపీ. ఇందులో భాగంగానే ఎంపీలతో రాజీనామా చేయించాడు జగన్. అయితే, వాటిని ఆమోదింపజేసుకునే విషయంలో మాత్రం పెద్ద రాద్దాంతం జరిగింది. రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు రాకుండా ఉండేందుకు జగన్ పెద్ద ప్లాన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఏపీలో తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పుకున్నారు.

jagan
తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ దీనిపై స్పష్టత ఇచ్చింది. శనివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని వ్యూహాత్మక తప్పిదంగా రాష్ట్ర రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉప ఎన్నికలు జరగకపోడానికి గత కారణాలను కూడా ఈసీ వివరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం 2019 జూన్‌ 4వ తేదీతో లోక్‌సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాలకు కనీసం ఏడాది పాటు అయినా ప్రజాప్రతినిధులు పదవిలో ఉండాలి. ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని ఎన్నికల చట్టంలో స్పష్టంగా ఉందని ఈసీ చెబుతోంది.

jagan-resign-mps
ఈ ఏడాది జూన్‌ 3వ తేదీన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. అప్పటి నుంచి లెక్క చూస్తే వచ్చే ఏడాది జూన్‌ 4వ తేదీకి లోక్‌సభ‌ పదవీకాలం గడువు ముగుస్తుంది. అంటే ఏడాది సమయం లేదనేది ఈసీ వాదన. కాబట్టి ఏపీలోని ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేల్చేశారు. అలాగే నక్సలైట్ల దాడిలో కన్నుమూసిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన అరకు శాసనసభాస్థానం ఖాళీ అయినా దీనికి కూడా ఎన్నిక నిర్వహించబోమని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ప్రకటనతో కేంద్రంలోని బీజేపీతో లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని, ఉప ఎన్నికలు రావని తెలిశాకే వాటిని స్పీకర్‌ ఆమోదించడం జరిగిందనే ఆరోపణలకు బలం చేకూరింది.