నిజాలు మరిచిన జగన్

jagan-says-the-reasons-behind-the-lossing-of-nandyal-by-poll-elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు.. నంద్యాల ఓటమికి వైసీపీకి కావల్సినన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ తన ప్రచారంతోనే పుట్టి ముంచేశారు. తొలి బహిరంగ సభలోనే సీఎంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి పెంచేశాయి. చంద్రబాబు లాంటి తెలివితేటలు లేకే తమ అధినేత కొంప ముంచాడని వైసీపీ మథనపడుతోంది.

సానుభూతి అనే ఫ్యాక్టర్ ఉండదని జగన్ భావించడం మొదటి మైనస్. పైగా చనిపోయిన వ్యక్తి కుటుంబంపై పోటీకి దిగడం రెండో మైనస్. ఇంత జరిగాక రోజాతో అఖిలప్రియ చుడీదార్లపై కామెంట్స్ చేయించడం పైత్యానికి పరాకాష్ట. ఇక శిల్పాకు ముస్లింల మద్దతు లేదని తెలిసి ఆయనకే టికెట్ ఇవ్వడం అతివిశ్వాసం. ఇలాంటి అహంకారంతోనే 2014లోనూ గెలుపు అవకాశాలు దూరం చేసుకున్నారు జగన్.

ఇక జగన్ చేసిన మరో పని తానే సీఎం అని ఢంకా బజాయించడం. ఇంకా ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో గెలిచేస్తామని చెబుతున్న జగన్.. ఓ ఉపఎన్నిక కోసం ఇన్నిరోజులు తిరగడం ఎందుకని జనం ఆలోచించారు. పైగా బాబును పదేపదే విమర్శించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇక అవినీతి పరుడిగా ముద్రపడ్డ జగన్.. తనకు పేపర్, టీవీ, డబ్బులు లేవని చెప్పడం జోక్ ఆఫ్ ది మిలీనియం గా మారిపోయింది.

మరిన్ని వార్తలు:

ఆప్ కి పూర్వవైభవం వచ్చినట్లేనా..?

ప‌దేళ్ల జైలు శిక్ష‌… క‌న్నీరు పెట్టుకున్న డేరా బాబా

ఇది సోష‌ల్ మీడియాపై గెలుపు కూడా….