Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ మాటలు హద్దులు దాటడం చూస్తూనే వున్నాం. సీఎం చంద్రబాబు ని తిట్టడానికే అంత దూకుడుగా వ్యవహరిస్తున్నాడని అనుకుంటుంటే పొరపాటే. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ప్రతినిధులు సాక్షులుగా ఉండగానే తన గురించి తనకు ఏ పత్రికలూ, చానెల్స్ లేవంటూ సునాయాసంగా అబద్ధం ఆడేశాడు. దీంతో పాటు నంద్యాల ATM సెంటర్ ప్రచారంలో జగన్ ఏమన్నాడో చూద్దామా !
- ఎన్నికలు రాకముందు చంద్రబాబు ఒక్కసారైనా నంద్యాల వచ్చారా? మూడున్నరేళ్లలో చంద్రబాబు నంద్యాలలో కనబడలేదు ఉపఎన్నిక వచ్చింది కాబట్టి నంద్యాల గుర్తుకొచ్చింది : వైఎస్ జగన్
- వైఎస్ఆర్ సీపీ పోటీని తట్టుకోలేక కేబినెట్ అంతా నంద్యాలలో దిగింది.నంద్యాలలో YSRCP పోటీ పెట్టకపోయి ఉంటే బాబు నంద్యాల వచ్చేవారా..? ప్రతి సామాజిక వర్గాన్ని బుజ్జగించే పనిలో చంద్రబాబు ఉన్నారు మాట వినకపోతే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: వైఎస్ జగన్
- ఈ మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా..? ఇంతకుముందు రేషన్ షాపులో 9 రకాల సరుకులు ఇచ్చేవారు కానీ చంద్రబాబు వచ్చాక ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు చంద్రబాబు హయాంలో అభివృద్ధి సున్నా: వైఎస్ జగన్
- ఎక్కడైనా రోడ్ల విస్తరణ జరుగుతుంది.. అది అభివృద్ధి కాదు ఎవరినీ అడగకుండా షాపులు, ఇళ్లను కూల్చేస్తారు: వైఎస్ జగన్
- నంద్యాలలో గజం రూ.1.10 లక్షలు ఉంది. సెంటు స్థలం రూ.50 లక్షల రేటు పలుకుతుంది. చంద్రబాబు రాత్రికి రాత్రి విస్తరణ పేరుతో బిల్డింగ్లను కూల్చేసి.. గజానికి రూ.18వేలు ఇస్తానంటున్నారు.. ఇదా అభివృద్ధి అంటే?
- బిల్డింగ్లు కూల్చేయడం, రోడ్లు తవ్వడం అభివృద్ధి కాదు.. రైతులు, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన అభివృద్ధి
- అహంకారంతో చంద్రబాబు కళ్లు తలకెక్కాయి ఇల్లు కట్టేందుకు అడుగుకి రూ.వెయ్యి అయితే… చంద్రబాబు మాత్రం కాంట్రాక్టర్లకు రూ.2,778 కి ఇచ్చారు. పేదలనుసైతం చంద్రబాబు వదిలిపెట్టలేదు: వైఎస్ జగన్
- డబ్బులతో చిన్నస్థాయి నాయకులను కొంటున్నారు: వైఎస్ జగన్
- చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఇవాళ మనం వేసే ఓటు జరగబోయే మార్పుకు నాంది పలకాలి. నాయకుడు చెప్పింది చేయకపోతే కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి రావాలి.
- రాబోయే రోజుల్లో చంద్రబాబు మీ దగ్గరకు వస్తారు. మూటలు, మూటలు డబ్బులు తీసుకుని మరోసారి మోసం చేసేందుకు వస్తారు. రూ.5 వేలు ఇచ్చి, దేవుడు పటం చూపి ప్రమాణం చేయించుకుంటారు.
- ఏ దేవుడూ కూడా పాపానికి ఓటేయమని చెప్పడు.. అలా దెయ్యాలే చెప్తాయి. రూ.5వేలు మీ చేతుల్లో పెట్టినప్పుడు దేవుడిని ప్రార్ధించి లౌక్యంగా ఓటేయండి. ధర్మానికే ఓటేయండి.. న్యాయాన్ని గెలిపించండి: వైఎస్ జగన్
- చంద్రబాబులా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపే ఛానళ్లు, పేపర్లు నా దగ్గర లేవు. నాకున్న ఆస్తి నాన్నగారు ఇచ్చిన పెద్ద కుటుంబమే: వైఎస్ జగన్
- వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో బతికుండటమే నా ఆస్తి. మీ జగన్ అబద్ధం ఆడడు.. మోసం చేయడు
మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి: వైఎస్ జగన్ - విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి: వైఎస్ జగన్
- నంద్యాల ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటా: వైఎస్ జగన్
- ఒక్క అవకాశం ఇస్తే నాన్న మాదిరిలా అందరి గుండెల్లో ముద్ర వేసుకుంటా: జగన్