నంద్యాలలో జగన్ తప్పులో కాలేశారా..?

Jagans Mistake In Nandyala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Jagans Mistake In Nandyala

గడిచిన పదమూడేళ్లలో నంద్యాలలో టీడీపీ జెండా ఎగరలేదు. అందుకే తమ విజయం ఖాయమని వైసీపీ శ్రేణులకు బాకా ఊదుతున్నారు జగన్. అదే నిజమైతే.. రాష్ట్రంలో జగన్ ఎప్పుడూ సీఎం పదవిపై కూర్చోలేదు. అలాంటప్పుడు ఆయన మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలా సీఎం అవుతారని లాజిక్ తీస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు జగన్ చెప్పే కబుర్లు కూడా అలాగే ఉన్నాయి.

నంద్యాలలో టీడీపీకి బలం లేకపోతే జగన్ నెల రోజుల పాటు కాలికి బలపం కట్టుకుని తిరగాలని ఎందుకు ఫిక్సయ్యారంటే వైసీపీ దగ్గర ఆన్సర్ లేదు. చంద్రబాబు, లోకేష్ ఇంతవరకూ ఒక్కసారి మాత్రమే నంద్యాల వచ్చారు. కానీ జగన్ మాత్రం అదేపనిగా తిరుగుతున్నారు. ఓ ప్రధాన ప్రతిపక్ష నేత ఒక్క నియోజకవర్గంలో ఉపఎన్నిక కోసం ఇన్నిరోజులు వెచ్చించడం అనేది దేశచరిత్రలోనే ఇదే మొదటిసారి.

ఓటమి భయంతో ప్రచారపర్వంలో మునిగితేలుతున్న జగన్.. వైసీపీ గెలుపు ఖాయమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. శిల్పా, భూమా ఫ్యామిలీల గురించి లోకల్ గా అందరికీ తెలుసు. ఎవరు అభివృద్ధి చేశారో కూడా తెలుసు. అలాంటప్పుడు భూమా ఫ్యామిలీని కాదని శిల్పాకు ఎలా ఓటేస్తారో జగనే సెలవివ్వాలి. ఏదేమైనా జగన్ మాత్రం ప్రచారంలో శృతిమించుతున్నారని, ఆ అతి దూకుడే కొంప ముంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు: