రోబో సైనికులొస్తున్నారు

Robo Soldiers are Getting Ready

Posted August 13, 2017 at 10:45 

 Robo Soldiers are Getting Ready

అమెరికా చుట్టుపక్కల ఆ దేశాన్ని సవాల్ చేసే దేశాలేవీ లేవు. అయినా సరే ఆ దేశం ముందు జాగ్రత్తగా అణ్వాయుధాలు పెద్దఎత్తున సమకూర్చుకుంది. ఇప్పటికీ రక్షణ సన్నధ్ధతలో ప్రపంచంలో మొదటిస్థానం అమెరికాదే. కానీ మన దేశం పరిస్థితి అది కాదు. చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. చిన్నదేశమైన శ్రీలంక కూడా తోక జాడిస్తోంది. ఇప్పటికే ఆయుధాలు సమకూర్చుకోవడంలో వెనుకబడ్డాం. కానీ ఓ విషయంలో మాత్రం ముందే ఉంటామంటోంది డీఆర్డీవో.

భారత్ ఆర్మీ ధైర్యసాహసాలకు కొదువలేదు. అయినా సరే సైనికుల్ని కోల్పోవడం మంచి విషయం కాదు. అందుకే చాటు నుంచి దాడిచేస్తున్న ఉగ్రదాడుల్ని తిప్పికొట్టడానికి సైనిక రోబోలు రంగంలోకి దిగుతున్నాయి. ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా యుద్ధం చేసే విధంగా వీటిని డీఆర్డీవో రూపొందిస్తోంది. కొద్దిరోజుల్లో ఇవి కశ్మీర్ సరిహద్దుల్లో సేవలు అందిస్తాయి.

దాదాపు 500 పైచిలుకు రోబోలు రెడీ అవుతున్నాయి. ఫలితాలు బావుంటే చైనా బోర్డర్లోనూ, నక్సల్స్ వ్యతిరేక పోరాటాల్లోనూ వీటిని ఉపయోగించే వీలుంది. ఇప్పటికే ఈ వార్త తెలిసి అటు పాక్, ఇటు చైనా ఉలిక్కిపడుతున్నాయి. ఇప్పటికే ఇండియా అంటే ఏడుస్తున్న చైనా.. రోబో సోల్జర్స్ గురించి తెలిసి ఇంకా కలవరపడుతోంది. అందుకే శత్రువుల్ని వారి హద్దుల్లో ఉంచాలంటే.. ఏదో రకంగా కొత్త సాంకేతికతకు మళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు:

SHARE