Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Is Jai Character Copied From Director Puri Jagannadh Script
ఎన్టీఆర్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఏవో కొన్ని సినిమాలు తప్ప ఎక్కువ సినిమాలు కూడా మంచి కథతో తెరకెక్కినవే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మంచి కథలు ఉన్నాయి. అలాంటి ఎన్టీఆర్‌కు కథలపై మంచి పట్టు ఉంటుంది. అందుకే గతంలో ఒకానొన సమయంలో పూరి జగన్నాధ్ చెప్పిన ఒక కథను బేస్ చేసుకుని ‘జై లవకుశ’ కథను దర్శకుడు బాబీతో అల్లించాడు. ఈ విషయాన్ని పూరి సన్నిహితుల వద్ద చెప్పి వాపోతున్నట్లుగా తెలుస్తోంది.
ఒక ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రకారం జై లవకుశ కథ గతంలో ఎన్టీఆర్‌కు పూరి చెప్పిన స్టోరీ లైన్‌తో తెరకెక్కుతుంది. టెంపర్ సమయంలోనే ఎన్టీఆర్‌తో పూరి ఒక స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. జై టీజర్‌ను చూసిన తర్వాత తాను చెప్పిన స్టోరీలో ఒక క్యారెక్టర్ తరహాలో జై పాత్ర ఉండబోతుందనిపిస్తుందని పూరి అన్నట్లుగా సదరు ఇంగ్లీష్ పత్రిక తన కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ విషయమై జై లవకుశ యూనిట్ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా పూరి మాత్రం ఈ విషయమై నోరు మెదపక పోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఒక వేళ ఆ విషయం తప్పు అయితే ఎన్టీఆర్ అండ్ టీం సదరు మీడియా సంస్థపై కేసు పెట్టే అవకాశాలున్నాయంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
మరిన్ని వార్తలు: