Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జైలవకుశ’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకలు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జైలవకుశ’ చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది. ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాలో హైలైట్ మిగిలినవన్ని కూడా పెద్దగా చెప్పుకోదగ్గవిగా లేవని, ముఖ్యంగా కథ సాదా సీదాగా ఉందంటూ కొందరు విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నింటికి కూడా కలెక్షన్స్ సమాధానం చెబుతున్నాయి. విడుదలైన రెండు వారాల్లో ఏకంగా 90 కోట్ల షేర్‌ను సాదించింది. తన గత చిత్రాల అన్ని రికార్డులను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్‌లో ‘జనతాగ్యారేజ్’ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ చిత్రం అంతకు మించిన కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది.
‘జనతాగ్యారేజ్’ చిత్రం 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ‘జైలవకుశ’ చిత్రం మొదటి రెండు వారాల్లోనే కంగా 130 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. మూడవ వారంలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మొత్తంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. జనతాగ్యారేజ్ చిత్రంతో పోల్చితే ఈ సినిమాకు జీఎస్టీ దెబ్బ తలిగింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ తన రికార్డులను తాను బద్దలు చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా మరోసారి తన రికార్డును తానే బద్దలు చేసుకున్నాడు.
జనతాగ్యారేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అన్న ట్రేడ్ వర్గాల వారు, ఆ సినిమాకు మించిన వసూళ్లు సాధిస్తుండటంతో ఎన్టీఆర్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ చిత్రం అంటూ పొగడ్త వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నాయి. ఈ చిత్రంతో విడుదలైన స్పైడర్ అంతగా ఆకట్టుకోలేక పోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం.