Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యిందని, అతి త్వరలోనే మిగిలి ఉన్న రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్లను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జై టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ లవకుమార్ మరియు కుశ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల లవకుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. దాంతో టీజర్ ఉండదేమో అని అనుకుంటున్నారు. కాని చిత్ర యూనిట్ సభ్యులు మూడు పాత్రలకు మూడు టీజర్లను విడుదల చేస్తామని తాజాగా ప్రకటించింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వినాయక చవితి సందర్బంగా లవకుమార్ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ లవకుమార్ పాత్రలో గుడ్డి వాడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. టీజర్లో ఎన్టీఆర్ గుడ్డి వాడిగా ఎలా కనిపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా అంటే ఈనె 25న లవకుమార్ టీజర్‌తో రాబోతున్నాడు. ఆ తర్వాత వారం రోజులకే అంటే సెప్టెంబర్ మొదటి వారంలోనే కుశ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో చిత్రం ఆడియోను కూడా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను దసరా కానుకగా చిత్రాన్ని సెప్టెంబర్ 22న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కు జోడీగా రాశి ఖన్నా మరియు నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా నటించగా, బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
మరిన్ని వార్తలు: