తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకునే సినిమా ‘జంబ లకిడి పంబ’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సీనియర్ నరేష్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రాన్ని అల్లరి నరేష్‌తో రీమేక్ చేయాలని, సీక్వెల్ చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నించారు. కాని అల్లరోడు మాత్రం సీక్వెల్‌ను సున్నితంగా తిరష్కరిస్తూ వచ్చాడు. తాజాగా శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకుని అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ మొత్తం మార్చడంతో పాటు, పలు మార్పులు చేర్పు చేసి సినిమాను తెరకెక్కించారు.
నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జంబ కిడి పంబ’ చిత్రం అట్టర్ ఫ్లాప్ టాక్‌ను దక్కించుకుంది. ఇంత చెత్త సినిమా అంటూ విమర్శకులు సైతం తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి చెత్త నటన మరియు టైటిల్‌కు తగ్గట్లుగా స్క్రీన్‌ప్లేను ప్లాన్ చేయలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతూ విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మొత్తానికి సినిమాలో మ్యాటర్ లేకుండా తీశారు. గత జంబ లకిడి పంబకు ఈ చిత్రానికి ఏమాత్రం సంబంధం లేదని, అసలు ఈ చిత్రాన్ని ఎందుకు ఆ టైటిల్‌తో తీశారో అంటూ ఆరోపిస్తున్నారు.