Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసలు పార్టీ సిద్దాంతాలు పూర్తవలేదు, ఇంకా జనాల్లోకి పూర్తిగా పార్టీ పేరు వెళ్ళలేదు. అప్పుడే పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తల మధ్య విభేదాలు పోరాచూపుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ పార్టీ నేతలు అభిమానులు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. పవన్ మా దేవుడు అని నెత్తిన పెట్టుకుని మోస్తున్న అభిమానులను నేతలు దగ్గరకు రానివ్వడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఆయన్ను అంటి పెట్టుకుని ఉన్నాం. మీరు కొత్తగా వచ్చారు. మా కష్టాన్ని ఊరికే పోనిస్తారా అంటూ గొడవకు దిగుతున్నారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ కు వారి చికాకు తెస్తున్నారు. పవన్ కల్యాణ్ ముందే వారు అసహనం వ్యక్తం చేస్తున్న తీరుతో పవన్ కే దిమ్మతిరిగినంత పనయ్యింది.
ఇటీవల కాలంలో జనసేనాని ప్రజా పోరాట యాత్రా చేస్తున్నారు ఈ నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక పవన్ కళ్యాణ్ కల్యాణ మండపంలో బస చేసారు. ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పవన్ ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నుండి వలస వచ్చిన పలాస మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావుకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం పై మిగతా వర్గం తట్టుకోలేక పోయింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ పూర్ణచంద్రరావుకు ప్రాధాన్యమివ్వడమేంటని ఆ వర్గం కల్యాణ మండపం ఎదుట ధర్నాకు దిగింది. ఇంకో పక్క అభిమానులను బౌన్సర్లు నెట్టేస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నా పవన్ తన స్పందన కూడా తెలియచేయ్యలేదు. బస్సు యాత్రలు చేసి జనంలో క్రేజ్ పెంచుకుందామనుకుంటున్నా పవన్ కి ఉన్నదీ పోయిందీ ఉంచుకున్నదీ పోయింది అన్న చందాన ఉన్న క్రేజ్ కూడా అటక ఎక్కే అవకాశాలు కనపడుతున్నాయి. అసలు జనసేన ఏదో కొత్త గ్రహం నుండి పుట్టింది అని కలరింగ్ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఏ పార్టీ నయితే అవినీతి పార్టీ అని విమర్శిస్తున్నదో అదే పార్టీ నుండి నేతలని అరువు తెచ్చుకోవడం ఆయన పార్టీ నేతలే మింగుడు పడడం లేదు. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి అనిపిస్తే వారికి కీలకమైన పదవులు కట్టబెట్టడం చూస్తే పవన్ రాజకీయంగా అయోమయ స్థితిలో ఉన్నారని ఈ పరిణామాల వాళ్ళ తేటతెల్లం అవుతోంది. పవన్ మిగిలిన పార్టీలకు ఏమాత్రం తీసిపోరని అనే భావన ఇప్పటికే ఆయన పర్యటన చేస్తున్న ప్రాంతాల్లో ప్రబలుతోంది ఇప్పటికయినా పవన్ నిద్ర లేవకపోతే మున్ముందు ప్రజారాజ్యం కంటే ఘోరమయిన పరిస్థితులు ఏర్పడడం ఖాయం.