కేసీఆర్ వంతు అయ్యింది…ఇక పవన్ డ్యూటీ

Janasena Pawankalyan To Start Third Front

తమిళనాడులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ విభజన సమస్యలపై అక్కడి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ తమిళంలో ప్రసంగం ప్రారంభించారు. తనను పరిచయం చేసుకుంటూ తన పేరు పవన్ కల్యాణ్ అని.. 2014లో జనసేన పార్టీ ప్రారంభించిన విషయాన్ని తెలిపారు. 20 ఏళ్లు చెన్నైలో ఉన్నానన్న పవన్ తన తమిళంలో ఏమైనా తప్పులుంటే క్షమించాలని కోరారు. ఐరోపా, అమెరికాలో పర్యటించిన తాను పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాల గురించి మాత్రం పట్టించుకోకపోవడం సరికాదు అనిపించిందని, అందుకే నేను నన్ను పరిచయం చేసుకుని, జనసేన ఉద్దేశాలను తమిళ ప్రజలకు, తమిళ నాయకులకు వివరించి ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను చర్చించేందుకు వచ్చానని అన్నారు. ఇక జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అవలంభిస్తున్న విధానాలను విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అలాగే తన చెన్నై పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు ప్రజారాజ్యం నుంచి రాజకీయ పోరాటం చేసాను, అప్పుడు 18 సీట్లు విజయం సాధించాం, మొత్తంగా చూసుకుంటే దాదాపు 23 శాతం ఓట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయని అందుకే రాష్ట్ర విభజన తీరు వలన ప్రజల కోసం పార్టీ పెట్టినప్పటి, అప్పటి రాజకీయ పరిస్థితుల వలన అనుభవజ్ఞుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని టీడీపీ కి మద్దతు ఇచ్చే, పోటీకి దిగలేదని అన్నారు. టీడీపీ, బీజేపీ కూటమి మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వారికి మద్దతు ఇచ్చే, వారికి ప్రచారం చేసాను, కానీ టీడీపీ ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయింది, వారు గెలిచిన దాదాపు అన్ని స్థానాల్లో వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని అన్నారు.

janasena

బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పడం వలన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, ప్రజలు చాలా బాధతో, కోపంగా ఉన్నారని, ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అని చెబుతూనే ఆయనపై సెటైర్లు వేశారు. ఆయన ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని అన్నారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మహాకూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక త్రాటి మీదకు రావలసిన అవసరం ఉందని, ఉత్తర,బీహార్ రాష్ట్రాలు దేశ రాజకీయాలను శాసించే విధానాన్ని మార్చాలి, మనం చిన్న పార్టీలు కావచ్చు కానీ మనమంతా కలిసి నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే రాష్ట్ర విభజన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది, బీజేపీ, నరేంద్రమోదీ గారు జవాబుదారీతనంతో పనిచేయాలి, మీరు ఇచ్చిన హామీల పట్ల ప్రజలకు సమాధానం తెలియజేయాల్సి ఉందని అన్నారు. అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా జనసేన పార్టీ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రెండవ రాజధాని ప్రకటన జరగాలి అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ముందుగా నేను అన్ని రాష్ట్రాలలో తిరిగి జనసేన సిద్ధాంతాలు తెలియజేయాలి అనుకుంటున్నని, తరువాత నాయకులను కలిసి, దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఒక త్రాటిపై ఉండేలా పనిచేస్తానని పవన్ ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక మాట మీద ఉన్నప్పుడు కేంద్రం నుంచి సరైన ప్రతిఫలాల్ని పొందవచ్చని చంద్రబాబు గారు పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు, ఆయన పంచాయితీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని కుమారుడు లోకేష్ ని పంచాయితీ శాఖ మంత్రిని చేశారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేన పార్టీ చేతిలో ఉంది, జనసేన మాత్రమే రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించగలదు, అందుకే ఇంతమంది ప్రజలు, నాయకులు జనసేనకు అండగా ఉన్నారని అన్నారు.

pawan-janasena
రాజకీయాల్లోకి వచ్చే నటులు కావచ్చు, వేరేవారైనా సరే వారికి చాలా సహనం కావాలి, కనీసం రెండు దశాబ్దాల పాటు మార్పు కోసం పోరాడే ఓర్పు కావాలని, జనసేన పార్టీని బీజేపీ లో కలపమని అడిగారని, ప్రజారాజ్యం సమయంలో కొన్ని అనుకోని తప్పులు జరిగి విలీనం చేయాల్సివచ్చింది, కానీ నేను పార్టీ ప్రజల కోసం పెట్టాను, వేరే వారితో కలపటానికి అయితే వారితో కలిసి పోటీ చేసేవాడినని ఆయన అన్నారు. మోదీ గారు ఏమి నా అన్నయ్య కాదు, నేను నా సొంత అన్నయ్యకి వ్యతిరేకంగా వెళ్లిన వాడిని, మోదీ గారికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడను అని అనుకుంటున్నారని ప్రశ్నించారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బలమైన త్రిముఖ పోటీ ఉండబోతుంది, బీజేపీ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వారి పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది వైస్సార్సీపీ లాంటి పార్టీతో జనసేన ఎందుకు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోంది, వారి అవినీతి, చేతకానితనం గురించి రోజు విమర్శిస్తుంటే వారితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం అనటం టీడీపీ వారి అసత్య ప్రచారాలు, వాటిని నేను పట్టించుకోనని అన్నారు. అయితే ఇంతకు ముందు దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు సిద్ధమయిన్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మద్దతు తెలిపారు. థర్డ్ ఫ్రంట్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని, కొత్త రక్తం పుట్టాలంటే థర్డ్ ఫ్రంట్ ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్ ను నడిపించే సత్తా కేసీఆర్ కు ఉందని, ఒకవేళ ఆయన థర్డ్ ఫ్రంట్ కు అంకురార్పణ చేస్తే తాను మద్దతిస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాలపై కేసీఆర్ కు లోతైన అవగాహన ఉందని పవన్ అన్నారు.

 

pawan-kcr

రక్తం చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దని పవన్ గుర్తుచేశారు. థర్డ్ ఫ్రంట్ ను కేసీఆర్ ముందుకు తీసుకెళ్లగలరనే నమ్మకం తనకు ఉందని పవన్ అన్నారు. తనది, కేసీఆర్ ది ఒకటే అభిప్రాయమని చెప్పారు. జాతీయ పార్టీల తీరువల్లే ప్రాంతీయ పార్టీలు పుడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కేంద్రం అన్ని హామీలు నెరవేర్చి ఉంటే జనసేన పుట్టేది కాదని పవన్ అన్నారు. జాతీయ పార్టీలు.. ప్రాంతీయ పార్టీలను అర్థం చేసుకోకపోతే థర్డ్ ఫ్రంట్ పుడుతుందన్నారు. థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఉండాలన్నది జనసేన అభిప్రాయమని చెప్పారు. త్రికరణ శుద్ధితో వెళ్తే కచ్చితంగా థర్డ్ ఫ్రంట్ విజయం సాధిస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు లేకుండా రాజకీయాలు జరగవని, దేశ అభివృద్ధి కూడా జరగదని చెప్పారు. అయితే ఇప్పుడు కేసీఆర్ తప్పుకుని తన పని తను చూసుకుంటుంటే బీజేపీ ఇప్పుడు పవన్ ను రంగంలోకి దిన్చించింది అని విశ్లేషకులు భావిస్తున్నారు.