Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవంబర్‌లో ఒకటి రెండు మూడు సినిమాలు మినహా ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. లెక్కకు మించి విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘ఆక్సీజన్’ మరియు ‘జవాన్’ చిత్రాల పరిస్థితి కూడా అలాగే ఉంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సీజన్ చిత్రానికి పర్వాలేదు అనే టాక్ వచ్చింది. కాని టాక్‌కు తగ్గట్లుగా కలెక్షన్స్ దక్కించుకోలేక పోతుంది. ఇక జవాన్‌కు ఒక మంచి సినిమా అంటూ పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో మెగా హీరో భారీ కలెక్షన్స్‌ను సాధించడం ఖాయం అని అంతా భావించారు. కాని షాకింగ్‌గా ‘జవాన్’ చిత్రం కలెక్షన్స్ చాలా డల్‌గా ఉన్నాయి.
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జవాన్ సందడి చేయలేక పోతుంది. దాంతో సినిమాను ప్రమోషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా విడుదలైనప్పటి నుండి ఏదో మాదిరిగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. అయినా కూడా ప్రేక్షకులు మాత్రం జవాన్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకుల మద్యకు వెళ్లాలని చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ అయ్యారు. త్వరలోనే టూర్‌ను ప్లాన్ చేస్తున్నట్లుగా దర్శకుడు రవి తెలియజేశాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పెట్టిబడి వసూళ్లు చేయడానికి కిందా మీదా పడుతుంది. అన్ని ఏరియాలోల కలిపి ఇంకా కూడా పెట్టుబడి రికవరీ కాలేదు అంటూ సమాచారం అందుతుంది. ప్రమోషన్ కారణంగా అయినా సినిమా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.