తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ స్వర్గీయ జయలలిత గారి గురుంచి తెలియనివారుండరు. మొదట ఆమె సినిమా లో నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. ఆమె అందం అభినయం తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని ఏండ్లు సినిమాలో ఉంటూ ఆ తరువాత సినిమా జీవితానికి స్వస్తిపలికి పూర్తిగా రాజకియనయకురాలిగా మారారు. అల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేట్ర కజ్హగం పార్టీలో చేరి చిన్నగా చిన్నగా ఎదుగుతూ తమిళనాట లేడీ చీఫ్ మినిస్టర్ గా మారారు.ఆ మద్య జయలలిత ఆరోగ్యం భాగా క్షీణించి మరణిచారు..ఇప్పుడు ఆమె జీవితాన్ని తెర రూపంలో రూపొందించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు పోటిపడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళ దర్శకురాలు ప్రియదర్శిని…. మరోక్కరు భారతీ రాజా ఇద్దరు ఆమె జీవితాన్ని తెర రూపంలో తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యం అవుతుంది. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఆమె జీవితాన్ని బుల్లి తెర రూపంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయన దర్శకత్వం వహిస్తాడ లేక నిర్మాతగా ఉంటాడా అనేది తెలియలిసి ఉన్నది. జయలలిత జీవిత చరిత్రను 30 ఎపిసోడ్స్ గా తెరకెక్కించేందుకు చక చక పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏదాది రెండోవ వారం నుండి ఈ ధారావాహిక ప్రోగ్రాం స్టార్ట్ అవ్వుతుంది. జయలలిత పాత్ర కోసం ఆమెకు దగ్గర పోలికలు ఉన్న తెలుగు యాక్టర్స్ రమ్య కృష్ణ ను తీసుకున్నారు. ఆ తరువాత దీనిని వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులో ఉంటుంది.