Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాస్పద వ్యాఖ్యలకి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం లోకసభ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరోసారి చిక్కుల్లో పడ్డారు. మొన్నటి మహానాడు వేదిక పైనుంచి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనమై ఆ పార్టీ శ్రేణులకి నిరసనలతో హోరేత్తిస్తుంటే ఈ సమయంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ఆధ్వర్యంలో జేసీ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి దహనం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీనిపై ఫైర్ అయిన జేసీ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసి పెనుదుమారం లేపారు. జేసీ అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన వ్యాఖ్యలకు నిరసనగా పలువురు దిష్టిబొమ్మ శవయాత్ర, దహనం వంటివి చేపడుతున్నారని, మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటిని తండ్రికి కొడుకులు చేస్తారన్నారు. తనకు ఈ జిల్లాలో నాకు ఇంతమంది కొడుకులా.? ఎప్పుడు కనింటినో ఏమో నాకే తెలీదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మరోసారి మండిపడ్డాయి. శవయాత్ర నిర్వహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు.