Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏమి రఘు నీ పద్ధతి ఏమి బాగాలేదు, ఏమి మీరు చీఫ్ విప్, మంత్రులు అయినంత మాత్రాన మీరు ఏమైనా గొప్ప అనుకుంటున్నారా? నేను ఎవరి మాట వినని తెలుసు కదా? నేను ఇచ్చిన పనికి బిల్లు ఎందుకు అపినావ్, దూరంగా ఉన్నవాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలి అని చూసుకోవలె కానీ ఇంకా దూరం చేసుకోడం ఎంది? ని పద్ధతి ఏమి బాగాలేదు అబ్బా…
ఇది చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డికి ఫోన్ చేసి జేసి దివాకర్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్. ఈ వార్నింగ్ ని ఎవరో దొంగచాటుగా వీడియో తీసి నెట్లో పెట్టారు. ఇప్పుడు ఇది వైరల్ అయ్యి కూర్చుంది. పుట్టపర్తి లోని 10 లక్షల సిమెంట్ రోడ్డు విషయమై వీరిద్దరి మధ్యా ఈ గొడవ రాగా, ఓ పీఆర్ ఉద్యోగి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవడంతో టిడిపి నాయకులూ పోలీసులకి పిర్యాదు చేశారు