‘దొరసాని’గా శివాత్మిక ఎంట్రీ?

Rajasekhar Daughter Sivatmika Tollywood Entry

జీవిత రాజశేఖర్‌ల పెద్ద కూతురు శివాని హీరోయిన్‌గా ‘2స్టేట్స్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అడవి శేష్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెద్ద కూతురు హీరోయిన్‌గా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే చిన్న కూతురును కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చేందుకు జీవిత రాజశేఖర్‌లు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరి చిన్న కూతురు శివాత్మిక ‘దొరసాని’గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

‘దొరసాని’ పూర్తి వివరాల్లోకి వెళ్తే… సురేష్‌బాబు మరియు మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా కేవీఆర్‌ మహేంద్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని చేయాలని మొదటి నుండి భావిస్తున్నారు. దాదాపు మూడు నాలుగు నెలలుగా ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఎట్టకేలకు ఈ చిత్రంలో హీరోయిన్‌గా శివాత్మిను ఎంపిక చేయగా, హీరోగా విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండను ఎంపిక చేయడం జరిగింది. శివాత్మిక మరియు ఆనంద్‌లతో ఫొటో షూట్‌ జరిపినట్లుగా సమాచారం అందుతుంది. దాంతో పాటు ఈ చిత్రం కోసం కొన్ని టెస్ట్‌ షూట్‌ సీన్స్‌ను కూడా చేసినట్లుగా తెలుస్తోంది. పల్లెటూరు కుర్రాడు అదే గ్రామంలోని దొర కూతురితో ప్రేమలో పడే నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుందని సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. పెళ్లి చూపులు తరహాలో ఈచిత్రంను తక్కువ బడ్జెట్‌తో రూపొందించి, ఎక్కువ పబ్లిసిటీ చేయాలనేది సురేష్‌బాబు ప్లాన్‌గా తెలుస్తోంది.