డ్రగ్స్‌ తీసుకునే వారికి జీవిత మద్దతు.. విమర్శలు

jeevitha rajasekhar support tollywood stars involved drugs rocket case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Jeevitha Rajasekhar Support Tollywood Stars Involved Drugs Rocket Case

 

టాలీవుడ్‌లో రవితేజ, పూరి జగన్నాధ్‌, ఛార్మి, చోటా కే నాయుడు, చిన్నా, నవదీప్‌ ఇంకా పలువురు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా వెళ్లడైంది. దాంతో పోలీసులు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. డ్రగ్స్‌ రాకెట్‌లో పట్టుబద్ద నేరస్తుల వద్ద తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వీరి పేర్లు బయటకు వచ్చాయి. దాంతో పోలీసులు కేసు బుక్‌ చేసి వీరిని విచారించేందుకు సిద్దం అవుతున్నారు. అందుకోసం నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపై జీవిత స్పందించిన తీరు వివాదాస్పదంగా ఉంది. వారిని వెనకేసుకు వచ్చేలా ఆమె మాట్లాడి విమర్శల పాలైంది. 

తాజాగా జీవిత రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు డ్రగ్స్‌ను తీసుకున్నట్లుగా రుజువులు ఉన్నాయి. అయితే సినిమా పరిశ్రమకు చెందిన వారినే ఎందుకు ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ పరువు తీసేలా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటూ జీవిత వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సినీ పరిశ్రమ వారు కూడా జీవిత వ్యాఖ్యలను సమర్థించడం లేదు. తప్పు చేసినప్పుడు ఎవరినైనా శిక్షించాల్సిందే. ఏ రంగంలో ఉన్నా పోలీసులు వారి పట్టుకుంటారు. సినీ పరిశ్రమకు చెందిన వారిని పట్టుకుంటున్న సమయంలో ఇలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు, ఇలా వ్యాఖ్యలు చేసినందుకు డ్రగ్స్‌ విషయంలో జీవితకు కూడా ఏమైనా సంబంధం ఉందా అని అనుమానించాల్సి వస్తుందని కొందరు అంటున్నారు.

మరిన్ని వార్తలు

డ్రగ్స్ తో సంబంధం ఉన్న టాలీవుడ్ నటీనటులు వీళ్ళే…