Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన వెలపడింతె పుస్తకంలోని జిమ్మిక్కి కమ్మల్ పాట ఈ ఏడాది ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పాట దేశవ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానింది. అంతేకాదు ఈ పాట ఖ్యాతి ఖండాంతరాలూ దాటిది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మి కెమెల్ కు ఈ పాట తనకు చాలా నచ్చిందని, పాట చరణాలు తన పేరును తలపిస్తున్నాయని చెప్పారు. అయితే సినిమాలోని పాట కన్నా..జిమ్మిక్కి కమ్మల్ కు కేరళ విద్యార్థుల వేసిన డ్యాన్స్ వీడియో మన దగ్గర బాగా పాపులర్ అయింది.
ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులు, టీచర్లు కేరళ సంప్రదాయ పండుగైన ఓనమ్ దుస్తుల్లో ఈ పాటకు ఓన్ కంపోజింగ్ చసుకుని డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్ షెరిల్ ఆగస్టు 30న యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. కొన్నగంటల్లోనే ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు ఈ ఏడాది యూ ట్యూబ్ లో మోస్ట్ ట్రెండింగ్ వీడియోల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు 1.9 కోట్లమందికి పైగా దీన్ని వీక్షించారు.