టీడీపీ నేత‌లు మాట్లాడుతున్నారు కాబ‌ట్టే… అమిత్ షా స‌మాధాన‌మిచ్చారు

Jitendra Singh comments on chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి కేంద్ర‌ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌ని కేంద్ర‌మంత్రి జితేంద్ర‌సింగ్ విజ‌య‌వాడ‌లో చెప్పారు. ఏపీపై మోడీకి ఎలాంటి వివ‌క్షాలేద‌ని తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే పక్క రాష్ట్రాలు కూడా అడుగుతాయ‌ని, అందుకే ప్ర‌త్యేక హోదా కాకుండా… దానితో స‌మానంగా ప్ర‌యోజ‌నాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ద‌క్కేలా ప్ర‌ధాని చ‌ర్య‌లు తీసుకున్నార‌ని జితేంద్ర‌సింగ్ చెప్పుకొచ్చారు. గ‌తంలో మూడు రాష్ట్రాలు ఏర్ప‌డినా… ఎవ‌రికీ హోదా ఇవ్వ‌లేద‌ని గుర్తుచేశారు. దీనిపై మీడియా ఆయ‌న్న నిల‌దీసింది. అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని 2014 ఎన్నిక‌ల్లో మోడీ ఇచ్చిన హామీని విస్మ‌రిస్తారా అని మీడియా ప్ర‌శ్నించ‌గా… హోదా ఇవ్వ‌కపోయిన‌ప్ప‌టికీ హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నీ క‌ల్పిస్తామ‌ని జితేంద్ర సింగ్ స‌మాధానం చెప్పారు.

ఏపీకి సాయం అందించే విష‌యంలో కేంద్రం ఏనాడూ వెనక‌డుగు వేయ‌లేద‌న్నారు. రూ. 350 కోట్లు ఏపీ ఖాతాలో వేసి వెన‌క్కి తీసుకోవ‌డంపైనా మీడియా జితేంద్ర‌సింగ్ ను ప్ర‌శ్నించింది. దీనికి స‌మాధానం ఇవ్వ‌ని ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఎదురుదాడి చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఆల‌స్యానికి కేంద్రం కార‌ణం కాద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. యూసీల గురించి మాట్లాడే హ‌క్కు అమిత్ షా కు లేద‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పైనా జితేంద్ర‌సింగ్ స్పందించారు. టీడీపీ నేత‌లు యూసీల గురించి మాట్లాడుతున్న‌ప్పుడు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స‌మాధానం చెబితే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు