స్వీడన్లో నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్(39) మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మార్చి 2న తప్పిపోయిన సాజిద్ ఏప్రీల్ 23న ఫైరిస్ నదిలో మృతదేహంగా తేలాడని పోలీసు అధికారి జోనాస్ ఎరోనెన్ తెలిపారు. మృతదేహనికి పోస్ట్‌మార్టం చేయగా సాజిద్ ఏదో నేరం చేసిన నిందితునిగా అనుమానం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక సాజిద్ మృతి హత్య లేదా ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందన్నారు.
సాజిద్ పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రాంతానికి చెందినవాడు. అతను బెలుచిస్తాన్ టైమ్స్ అనే వెబ్‌సైట్‌కి చీఫ్ ఎడిటర్ పని చేసేవారు. పాకిస్తాన్లో చోటు చేసుకొనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలు, పాక్ ఆర్మీ తిరుగుబాటుపై పలు కథనాలు రాశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సాజిద్ 2012లో స్వీడన్‌కు వలస వెళ్లారు. 2017లో స్వీడన్‌లోని ఉప్ప్సలాలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతను చివరిసారిగా స్టాక్ హోంలోని ఉప్ప్సలాలో రైలు ఎక్కినట్లు పోలీలు తెలిపారు.