Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలోనే చిత్ర ప్రమోషన్‌ను స్పీడప్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ మూడు పాత్రల్లో ఇప్పటికే జై పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఇక తాజాగా లవకుమార్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా లవకుమార్ టీజర్ డేట్‌ను ప్రకటించారు. రాఖీ పండగ సందర్బంగా ఈనెల 7న లవకుమార్ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
లవకుమార్ టీజర్‌తో చిత్రంపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయంగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన జై టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టీజర్ సాధించని అనూహ్య వ్యూస్‌ను దక్కించుకున్న జై టీజర్ తర్వాత రాబోతున్న లవకుమార్ టీజర్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని, రికార్డులు బ్రేక్ చేస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. జై టీజర్ రికార్డును లవకుమార్ టీజర్ బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. జై టీజర్లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపించాడు. ఆ టీజర్‌కు అనూహ్యంగా స్పందన వచ్చి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
మరిన్ని వార్తలు: