జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో కూడా హీరో ఏ అని కచ్చితంగా మనం చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి శాలిని కి ఇచ్చిన మాట అసలు తప్పలేదు. హరికృష్ణ రెండవ భార్యగా ఈమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. శాలిని సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేస్తూ ఉండేవారు. ఆ టైంలో ఆమెకి హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. హరికృష్ణ కి పెళ్లి అయినా కూడా చాలు నేను రెండవ పెళ్లి చేసుకుంటానని చెప్పారట.
ఇలా హరికృష్ణ శాలిని రెండవ భార్య కింద అయింది అయితే నందమూరి కుటుంబం నుండి ఆమెకి గౌరవం లభించేది కాదంట . ఆడపిల్లలకి ఇలాంటి ఇబ్బందులు కలగడం అసలు మంచిది కాదని ఆమె భావించేది. అత్తింటి వాళ్ళ నుండి సపోర్ట్ ఉండేది కాదట అయితే ఎన్టీఆర్ హీరో అయ్యాక తల్లిని బాగా చూసుకునేవారట. ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఏ అమ్మాయిని కూడా చిన్న చూపు చూడొద్దని ఎవరిని చులకనగా చూడొద్దని శాలిని ఎన్టీఆర్ కి చెప్పింది. తల్లి చెప్పినట్లే అందరిని గౌరవిస్తూ ఉంటారు ఎన్టీఆర్. తల్లికిచ్చిన మాట కోసం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చాక తాను ఏ తప్పు చేయలేదు. పెద్దవాళ్లయినా చిన్నవాళ్ళైనా అమ్మాయిలని గౌరవిస్తారు ఎన్టీఆర్.